కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముడి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 19 వరకు అంటే 10 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయి. ఈనెల 15న సీతారాముల కల్యాణంఉంటుంది. దీన్ని లక్ష మంది వీక్షించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ వేళ ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రెండేళ్లుగా కరోనా వల్ల ఏకాంతంగానే రాములోరి ఉత్సవాలు జరుగుతున్నాయి.


అంటే దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ అత్యంత వైభవంగా రాములోరి ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈరోజు రాత్రి అంకురార్పణ జరుగుతుంది. దీంతో  వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టే.. ఈ పది రోజుల ఉత్సవాల తర్వాత ఈనెల19న చివరగా పుష్పయాగం జరుగుతుంది. దీంతో వేడుకలు ముగుస్తాయి. ఇక 10వ తేదీ ధ్వజారోహణ ఘనంగా నిర్వహిస్తారు. తిరుపతి ఆగమశాస్త్ర పండితులు ఈ కార్యక్రమానికి వస్తారు. వారి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.


ఇక ఈనెల 15న సీతారాముల కల్యాణ మహోత్సవం మహా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలంలో ప్రభుత్వ లాంచనాలతో శ్రీరాముని కల్యాణం జరుగుతుండేది.. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2015 నుంచి వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇ ఇక్కడ 2016 నుంచి టీటీడీ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి.


దేశమంతా శ్రీరామ కల్యాణం పగటి పూట జరగుతుండగా ఒక్క ఒంటిమిట్టలోనే చంద్రుడు చూసేలా ఒంటిమిట్టలో రాత్రి సమయంలో  కల్యాణం నిర్వహించడం విశేషం. అందుకే ఈ ఏడాది కూడా బహిరంగ ప్రదేశంలో శ్రీసీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.  52 ఎకరాల విస్తీర్ణంలో ... 52 వేల మంది కూర్చోని ప్రత్యక్షంగా చూసేలా టీటీడీ వేదిక సిద్ధం చేసింది. శాశ్వత కల్యాణ వేదిక నిర్మించిన తర్వాత జరుగుతున్న తొలి కల్యాణ వేడుక ఇదే.


మరింత సమాచారం తెలుసుకోండి: