రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాన్ దత్తపుత్రుడా ? కాదా అనే విషయమై చర్చ మొదలైంది. చంద్రబాబునాయుడుకు పవన్ దత్తపుత్రుడని జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలంతా పదే పదే చెబుతున్నారు. కానీ పవన్ ఎవరికీ దత్తపుత్రుడు కాదని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యానారాయణ అంటున్నారు. తమ నాయకుడు పవన్ను దత్తపుత్రుడంటారా అంటు బొలిశెట్టి మండిపోతున్నారు. సోఫా కింద దూరిచూశారా ? అంటే జగన్ను నిలదీస్తున్నారు.





ఇక్కడ విషయం ఏమిటంటే పవన్ దత్తపుత్రుడా ? కాదా ? అనే విషయం ఏ సోఫాకింద దూరినా తెలీదు. అసలు సోఫా కింద దూరాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పవన్ చేస్తున్న రాజకీయం చూసిన వాళ్ళల్లో చాలామందికి ఇదే అనుమానాలున్నాయి. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయంగా పవన్ రాజకీయాలు చేస్తున్న విషయం అందరికీ కనబడతునే ఉంది. పవన్ నిఖార్సయిన రాజకీయం చేస్తుంటే జగన్-చంద్రబాబు ఇద్దరినీ నిలదీసుండాలి. మొదటినుండి పవన్ వైఖరి చంద్రబాబుకు అనుకూలంగానే ఉంది. మధ్య మధ్యలో కాస్త మారినా హోలు మొత్తంమీద చంద్రబాబు మనిషే అనిపించుకుంటున్నారు. 





అయితే ప్రతిపక్షంలో ఉన్నా జగన్నే నిలదీసి అధికారంలో ఉన్నా జగన్నే నిలదీస్తున్నారు పవన్. ఇక్కడే అందరిలోను పవన్ వైఖరిపై అనుమానాలు పెరిగిపోయాయి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు పవన్ నిలదీయాల్సింది చంద్రబాబును. కానీ నిలదీసింది మాత్రం జగన్నే. ఒక ప్రతిపక్ష నేత మరో ప్రతిపక్ష నేతను నిలదీయటం, వెంటపడటం దేశం మొత్తంమీద ఏపీలో మాత్రమే జరిగింది. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోయింది వాస్తవం. 




ఇపుడు ఏపీ ఆర్ధికసంక్షోభంలో ఉందంటే అందుకు చంద్రబాబే ముఖ్య కారణం. అలాంటిది చంద్రబాబును వదిలిపెట్టి కేవలం జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. చివరకు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో నరేంద్రమోడిని ప్రశ్నించాల్సిన పవన్ టార్గెట్ అంతా జగన్ మీదే పెట్టారు. అందుకనే చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడని వైసీపీ అంటున్నది. కంటికి కనబడుతున్నదానికి మళ్ళీ సోఫా కింద దూరాల్సిన అవసరమే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: