హిందువులందరూ కలిసికట్టుగా ఎంతో అంగరంగ వైభవం గా జరుపుకునే పండుగల్లో శ్రీరామ నవమి కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. ఎక్కడ చూసిన శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవం గా జరుగుతూ ఉంటాయి. సీతారాములుకు  పెళ్లి చేసి ఎంతో సంబరపడి పోతూ ఉంటారు ప్రతి ఒక్కరు. శ్రీరామ నవమి వేడుకలు అటు భద్రాచలం లో మాత్రం కన్నులపండుగగా జరుగుతుంది అనే విషయం తెలిసిందే  ఇక తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను చూసేందుకు భద్రాచలం తరలి వెళుతుంటారు.


 కాగా నేడు శ్రీరామనవమి వేడుకలు సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు మిథిలా స్టేడియంలోని శిల్ప కళా శోభితమైన కళ్యాణ మండపంలో అంతా సిద్ధం చేశారు.  శనివారం రాత్రి నుంచి వైకుంఠ ద్వారం ద్వారా సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా నిర్వహించారు  ఇక ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక ప్రస్తుతం భద్రాచలంలోని రామాలయం విద్యుత్ దీపాలంకరణ చలువ పందిళ్లు చాందిని వస్త్రాలంకరణ శ్రీ రామానుజాచార్యులుతో సుందరం గా మారిపోయింది. భద్రాచలంలో భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మూడు లక్షల చదరపు అడుగులలో చలువ పందిళ్ల, షామియానాలు భద్రాచలంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు అని చెప్పాలి.  తెలుగు రాష్ట్రాలు శ్రీరామనవమి వేడుకలు కోసం 500  బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీరామనవమి మహా పట్టాభిషేకం పురస్కరించుకుని 10వ తేదీన సీఎం కెసిఆర్ 11 న గవర్నర్  తమిళసై  దంపతుల రాకను పురస్కరించుకుని భద్రాచలం పట్టణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో కూడా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: