జగన్మోహన్ రెడ్డి అంటే వ్యక్తిగతంగానే చాలామందికి ఏమాత్రం పడదని అందరికీ తెలిసిందే. మామూలుగా అయితే ఎన్నికల వరకు ఎంతటి వైరం ఉన్నా ఫలితాలు వచ్చిన తర్వాత ఆ గొడవలను మరచిపోతారు. కానీ జగన్ విషయంలో మాత్రం వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర మొదలైన విధ్వేషం ఇంకా కంటిన్యు అవుతునే ఉంది. సరే ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చేస్తున్నది కాబట్టి ఈ విధ్వేషం ఇంకా పెరిగిపోతుందనటంలో సందేహంలేదు.
ఇందులో భాగంగానే జగన్ ఏమి చేసినా తప్పే చివరకు ఏమీ చేయకపోయినా తప్పే అన్నట్లుగా తయారైంది ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా వ్యవహారం. క్యాబినెట్లో ఎక్కువమందికి బీసీలకు అవకాశం ఇచ్చినందుకు జగన్ పై తమ్ముళ్ళో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో నాలుగు సామాజికవర్గాలను చోటు కల్పించటంపై నానా రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే బీసీలకు ఎక్కువమందికి అవకాశమిచ్చినా తప్పే నాలుగు సామాజికవర్గాలకు అసలు చోటివ్వకపోయినా తప్పే. జగన్ను తప్పుపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టే వీళ్ళ మాటలు విచిత్రంగా ఉంటున్నాయి
తమ్ముళ్ళ వరసిలాగుంటే చంద్రబాబునాయుడుకు వీర మద్దతుదారుడుగా ప్రచారంలో ఉన్న కొలొకిపూడి శ్రీనివాస్ బాధ మరోరకంగా ఉంది. ఈ విశ్లేషణ విన్నవారంతా ఎలా రియాక్టవాల్లో అర్ధంకాక బుర్రగోక్కుంటున్నారు. ఇంతకీ ఆయన చెప్పేదేమిటంటే ఎస్సీ, బీసీ సామాజికవర్గాల్లో మహిళలకు జగన్ పెద్దపీట వేయటంపై ఈయన విశ్లేషించారు. ఆయన విశ్లేషణ ఏమిటయ్యా అంటే ఎస్సీ, బీసీ సామాజికవర్గాల్లో మహిళలకు ఎందుకు మంత్రిపదవులిచ్చారంటే పై సామాజికవర్గాల్లోని మగనేతలను తొక్కేయటానికేనట.
ఎస్సీ, బీసీ వర్గాల్లో మగనేతలు ఎదగటం జగన్ కు ఏమాత్రం ఇష్టంలేదట. అందుకనే ఏరికోరి మహిళలను మంత్రులుగా తీసుకున్నారట. మరి కొలికిపూడి విశ్లేషణ నిజమే అనుకుంటే ఎస్సీ, బీసీ వర్గాల నుండి బొత్సా, ఆదిమూలపు సురేష్ లాంటి మంత్రులున్నారన్న విషయాన్ని ఆయన మరచిపోయినట్లున్నారు. జగన్ అంటే చాలామందికి ఏమాత్రం పడదన్న విషయం తెలుసుకానీ మరీ ఇంత అన్యాయంగా విశ్లేషించటం, రామా అన్నకూడా బూతు మాట కింద జమచేయటం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో జనాలు ఇపుడే చూస్తున్నారు.