ఈమధ్య జగన్మోహన్ రెడ్డి రెండు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అవిరెండు కూడా పార్టీకి చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. బహుశా ఈ రెండుకూడా వచ్చే ఎన్నికల్లో తనకు ప్లస్సవుతాయని జగన్ అంచనా వేసినట్లున్నారు. అందుకనే ధైర్యంచేసి మరీ నిర్ణయాలు తీసుకున్నారు. ఇంతకీ  అంతటి కీలకనిర్ణయాలు ఏమిటంటే మొదటిదేమో మంత్రివర్గంలో బీసీలకు పెద్దపీట వేయటం. ఇక రెండోదేమిటంటే జాబ్ మేళాలు నిర్వహించటం.





ముందు మొదటి నిర్ణయాన్ని చూద్దాం. సమాజంలోని మొత్తం జనాభాలో సగానికి పైగా ఉన్నది బీసీలే. వీళ్ళు ఏపార్టీకి మద్దతుగా నిలిస్తే విజయం దాదాపు ఆ పార్టీదే అనటంలో సందేహంలేదు. ఇంతకాలం టీడీపీకి మద్దతుగా ఉన్న బీసీలను తనవైపుకు తిప్పుకోవటంలో జగన్ సక్సెస్ అయినట్లే. టీడీపీలో కూడా బీసీలున్నప్పటికీ అక్కడ అధికారమంతా దశాబ్దాలతరబడి కొందరు నేతలచేతుల్లోనే ఉందిపోయింది. అంటే పేరుకు టీడీపీ బీసీల పార్టీకానీ వాస్తవం మాత్రం కొందరు బీసీలు మాత్రమే లబ్దిపొందారు.





ఈ విషయంలోనే జగన్ ధైర్యంచేసి మంత్రివర్గంలో మార్పులు చేశారు. మొదటి క్యాబినెట్లో 8 మంది బీసీలుంటే  రెండో క్యాబినెట్లో 10 మంది బీసీలను తీసుకున్నారు. పైగా మొదటిక్యాబినెట్లోని బీసీల స్ధానంలో చాలమందిని కొత్తవారిని తీసుకున్నారు. అంటే బీసీల్లోనే కొత్త నేతలకు మంత్రులుగా అవకాశమిచ్చారు. టీడీపీలో ఈ విధంగా జరిగింది చాలా తక్కువ. అందుకనే ఎప్పుడూ అదే యనమల రామృష్ణుడు, అచ్చెన్నాయుడు, కొల్లురవీంద్ర లాంటి కొంతమందే కనబడుతుంటారు.





ఇక జాబ్ మేళాలో దాదాపు 25 వేలమంది పాల్గొన్నారు. వీరిలో సుమారు 8 వేలమందికి ఉద్యోగాలొచ్చాయి. అంటే పార్టీని నమ్ముకుంటే ఉద్యోగాలొచ్చాయనే తృప్తి ఉంటుంది కదా. తిరుపతిలో జరిగింది మొదటి జాబ్ మేళా మాత్రమే. విశాఖపట్నం, గుంటూరులో మరో రెండు జరగబోతున్నాయి. వీటిల్లో కూడా సుమారు 15 వేలమందికి ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నారు. అంటే పార్టీని నమ్ముకున్నందుకు సుమారు 22 వేలమందికి ఉద్యోగాలు వచ్చాయంటే మామూలు విషయంకాదు. వీరంతా అటు ఉద్యోగాలు చేసుకుంటునే ఇటు పార్టీకీ పనిచేయటం ఖాయం. ఈ రెండు కీలక నిర్ణయాలు వచ్చే ఎన్నికల్లో పార్టీకి లాభిస్తాయని జగన్ నమ్ముతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: