నిద్రలో అయినా మెలకువలోఅయినా రాష్ట్రం మేలుకోరే వ్యక్తి కేవలం చంద్రబాబునాయుడు మాత్రమే. 24 గంటల్లో 18 గంటలు పనిచేసి రాష్ట్రాన్ని ఏస్ధాయిలో అభివృద్ధి చేయాలా అని ఆలోచించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు మాత్రమే. 2014 విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలని అనుకున్నారు. ఏ దేశంలో తిరిగితే ఆ దేశపు రాజధానిని తలదన్నే రీతిలో ఏపీకి రాజధానిని నిర్మించాలని అనుకున్నారు.





కానీ జనాలు అర్ధంచేసుకోకుండా టీడీపీని ఎన్నికల్లో పాతాళంలోకి తొక్కేశారు. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అందినకాడికి అప్పులు చేస్తు సంక్షేమపథకాలను అమలుచేస్తు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. కాబట్టి జనాలు అర్జంటుగా చేయాల్సింది ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబునే గెలిపించాలి. అప్పుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ జగన్ లాగ సంక్షేమ పథకాలను కాకుండా కేవలం అభివృద్ధి మంత్రంతోనే రాష్ట్రాభివృద్ధి చేయాలి.





దీనికన్నా ముందు చంద్రబాబు చేయాల్సిందేమంటే రాష్ట్రం మంచికోరి సంక్షేమ పథకాలను అన్నింటినీ నిలిపేస్తానని ప్రకటించాలి. ఎందుకంటే జగన్ వల్లే ఏపీ శ్రీలంక లాగ అయిపోతుందని చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియా ప్రతిరోజు బాధపడుతోంది కదా. కాబట్టి సంక్షేమ పథకాలను నిలిపేస్తే వేల కోట్ల రూపాయలు సేవ్ అవుతుంది. అలా సేవ్ అయిన వేల కోట్లరూపాయలతో ముందు అప్పులు, వాటి వడ్డీలు కట్టేయచ్చు. మెల్లిగా అభివృద్ధి మీద దృష్టిపెట్టచ్చు. తర్వాత ఇక అభివృద్ధిలో ఏపీ రేసుగుర్రం లాగ పరుగులు పెడుతుంది.





ఈపని చంద్రబాబు మాత్రమే చేయగలరు. సంక్షేమ పథకాలను నిలిపేయటం ద్వారా మిగిలే వేల కోట్ల రూపాయలతో ఎన్నో రంగాల్లో మౌళిక సదుపాయాలు ఏర్పాటుచేయచ్చు, పరిశ్రమలు పెట్టి వేలాదిమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించచ్చు. భవిష్యత్తును దర్శించగలిగిన శక్తి చంద్రబాబుకు తప్ప జగన్ లాంటి వాళ్ళకు ఉండదని జనాలందరికీ తెలియాలి. అప్పుడు కానీ జనాలకు 2019 ఎన్నికల్లో తాము చేసిన తప్పేంటో తెలీదు. భవిష్యత్తులో జనాలు మళ్ళీ ఇంకోపార్టీ గురించి ఆలోచించకూడదంటే రాష్ట్రం మంచికోరి చంద్రబాబు సంక్షేమ పథకాలను నిలిపేస్తానని ఒక్కటంటే.. ఒక్కమాట చెబితే చాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: