రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీకి సంబందించి  ఏపీ పరిస్దితి పచ్చటి చెట్టులాగుండేది. ఎప్పుడైతే విభజన జరిగిందో సీమాంధ్రలో పార్టీ పరిస్ధితి ఎండిపోయిన మోడులాగ తయారైంది. పోనీ తెలంగాణాలో ఏమైనా పచ్చగా ఉందా అక్కడాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి రెంటికి చెడ్డ రేవడి అన్నట్లుగా తయారైంది. అనాలోచిత నిర్ణయాలు, అడ్డుగోలు నిర్ణయాలు, క్షేత్రస్ధాయి పరిస్ధితిని అర్ధంచేసుకోకుండా తీసుకున్న నిర్ణయాల ప్రభావం వల్లే ఏపీ జనాలు పార్టీకి ఘోరీకట్టేశారు.





అందుకనే రెండువరుస ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేసిన నేతల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు. అలాంటిది పార్టీని బతికించుకునేందుకు చివరాఖరి ప్రయత్నం చేస్తున్నట్లున్నారు పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్. తొందరలోనే పాదయాత్ర చేయాలని డిసైడ్ చేసుకున్నారట. మేనెల చివరి వారంలో సొంతజిల్లా అనంతపురం నుండి కానీ లేదా శ్రీకాకుళం జిల్లా నుండికానీ పాదయాత్ర మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే పాదయాత్రంతా ఒకేవిడతలో కాకుండా మూడు విడతల్లో చేయబోతున్నారట.





మొదటివిడతగా 100 రోజుల్లో 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నట్లు సమాచారం. అంటే ప్రతీవిడత 100 రోజులు, 1500 కిలోమీటర్లు ఉంటుందని కాదు. పాదయాత్రకు తగ్గట్లుగా పార్టీ రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది. పాదయాత్రంటే ఉదయం నుండి సాయంత్రం వరకు నడవటం, సాయంత్రం ఎక్కడుంటే అక్కడే టెంటు వేసుకుని విశ్రాంతి తీసుకోవటం సహజమే కదా ? ఆ విశ్రాంతిలోనే స్ధానికంగా ఉండే పార్టీ నేతలు, క్యాడర్ తో సమావేశాలు నిర్వహించబోతున్నారు.





తనతో నడిచే ప్రజలతో వాళ్ళ సమస్యలు వింటు పాదయాత్రలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలని సాకే ప్లాన్ చేస్తున్నారట. గ్రౌండ్ లెవల్లో వర్కవుట్ అయిన తర్వాత పాదయాత్ర కార్యక్రమాన్ని అధిష్టానానికి పంపి ఆమోదం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అధిష్టానం గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎన్నికల మొదలయ్యే సమయానికి పాదయాత్ర ముగిసేట్లుగా ప్లాన్ చేయచ్చని అనుకుంటున్నారు. అందుకనే పాదయాత్ర చివరి ప్రయత్నంగా అందరు అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: