కథ అక్కడితో ఆగిపోతే పర్లేదు, సజ్జలకు జగన్ ఇంపార్టెన్స్ ఇచ్చారని అనుకోవచ్చు. అదే సమయంలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గిపోవడంతో వైసీపీలో లుకలుకలు అంటూ వైరి వర్గం విరుచుకుపడుతోంది. అప్పటి వరకూ ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా ఉన్న విజయసాయికి ఆ పదవి పోయింది. ఆయన్ను కేవలం వైసీపీ అనుబంధ విభాగాల కోఆర్డినేటర్ గానే నియమించారు సీఎం జగన్. అది మినహా విజయసాయికి మరో పార్టీ పదవి లేదు. అంటే ఓవైపు సజ్జలకు కీలక పదవులు దక్కాయి, మరోవైపు విజయసాయికి మాత్రం కేవలం అనుబంధ విభాగాల ఇన్చార్జ్ అనే పదవి మాత్రమే వచ్చింది. దీంతో సహజంగానే కొంత డిస్ట్రబెన్స్ మొదలవుతుందనే సంకేతాలు వచ్చాయి. అయితే వెంటనే వాటిని సవరించారు సీఎం జగన్.
సజ్జలతోపాటు విజయసాయికి కూడా ప్రయారిటీ పెంచారు. కానీ సజ్జలకు అనివార్యంగా అన్యాయం జరిగిందనే భావన కూడా మొదలైంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజనర్ కోఆర్డినేటర్లకు రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ గా సజ్జల వ్యవహరించాల్సి ఉంది. కానీ ఆ స్థానాన్ని ఇప్పుడ విజయసాయికి అప్పగించారు. సజ్జలకు వైసీపీ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్, మీడియా కోఆర్డినేటర్ అనే కొత్త పదవులు సృష్టించారు. అయితే సజ్జలకు ఇచ్చిన పదవి తీసుకెళ్లి విజయసాయికి ఇవ్వడం భావ్యం కాదని కొంతమంది అంటున్నారు. మరి నిజంగానే సజ్జలలో కూడా అసంతృప్తి ఉందా, ఆయన కూడా తన పదవి తనకు కావాలని అనుకుంటున్నారా..? లేదా ఎమ్మెల్యేలు, మీడియా కోఆర్డినేటర్ గానే సంతృప్తి పడతారా అనేది తేలాల్సి ఉంది.