ఇందులో అనుమానమే లేదు కచ్చితంగా ఓవర్  యాక్షన్ అని అర్ధమైపోతోంది. తన రాష్ట్రం గురించి ఎంత గొప్పచెప్పుకున్నా ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ తన గొప్పతనం నలుగురికి తెలియాలని పక్కనున్న వాళ్ళని లోకువగా మాట్లాడాల్సిన అవసరంలేదు. కానీ ఇపుడు తెలంగాణా మంత్రి కేటీయార్ చేసింది ఇదే. అందుకనే దీన్ని అందరు ఓవర్ యాక్షన్ అంటున్నది.





ఇంతకీ విషయం ఏమిటంటే క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగిన ఓ ఫంక్షన్లో తెలంగాణా ప్రత్యేకించి హైదరాబాద్ గొప్పదనం గురించి బాగా డప్పుకొట్టుకున్నారు. ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం ఏమీలేదు. కానీ కేటీయార్ తన పరిధిదాటిపోయి పేరు చెప్పకుండా ఏపిని అవమానకరంగా మాట్లాడటమే అందరు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఫ్రెండ్ ఎవరో ఏపీలోని ఒక జిల్లాకు వెళ్ళొచ్చిన తర్వాత తన అనుభవం గురించి కేటీయార్ కు ఫోన్ చేశారట.





ఆ ఫ్రెండ్ ఎవరో ఏమి చెప్పారోకానీ కేటీయార్ మాత్రం ఏపీలో కరెంటు లేదని, నీళ్ళు లేవని, రోడ్లు బాగాలేదాని చెప్పారట. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళందరినీ ఒకసారి ఏపీకి వెళ్ళిరమని చెబితే టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పదనమేంటో తెలుస్తుందని చెప్పాడట. ఈ విషయం చెబుతు తాను డప్పుకొట్టుకోవటం లేదని కూడా కేటీయార్ అన్నారు. అంటే తాను డప్పుకొట్టుకుంటున్నట్లు జనాలు అనుకుంటున్నారనే అనుమానం వచ్చినట్లే కదా. కేటీయార్ ఓవర్ యాక్షన్ను పట్టుకుని నారావారి పుత్రుడు లోకేష్ ట్విట్టర్లో మరీ ఓవర్ యాక్షన్ మొదలుపెట్టేశాడు.





ఇక హైదరాబాద్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. హైదరాబాద్ లోనే రోజుకు ఎన్నోసార్లు కరెంటు పోతుంది. నగరం రోడ్లలోని గుంతల కారణంగా ఎన్ని ప్రమాదాలు అయ్యాయి ? ఎంతమంది చనిపోయారో అందరికీ తెలుసు.  ఇక నీటి సరఫరా లేని కారణంగా జనాలు చాలామందే ఇబ్బందులు పడుతున్నారు. పేరుకుమాత్రమే హైదరాబాద్ విశ్వనగరం కానీ ఇక్కడునన్ని సమస్యలు ఇంకెక్కడా ఉండవు. వర్షంపడితే విశ్వనగరం ఎంత అధ్వాన్నంగా ఉంటుందో ప్రపంచానికంతా తెలుసు. విభజన కారణంగా వడ్డించిన విస్తరిలాంటి హైదరాబాద్ ను తీసుకుని తామేదో ఉద్దరించేశామని చెప్పుకోవటమంటే కచ్చితంగా డప్పు కొట్టుకోవటమే. అందుకనే ఈ డప్పుపై ఏపీ మంత్రులు, బొత్సా సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామంచద్రారెడ్డి, రోజా, జోగి రమేష్ లాంటివాళ్ళు మండిపడుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: