ఒకరిపై మరొకరి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలాగున్నా వచ్చే ఎన్నికల్లో అధికారం అందుకునే విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడుది ఒకేమాట ఒకేబాటనే ఎంచుకున్నారు. అధికారంలోకి వచ్చే విషయంలో మొదటినుండి జగన్ జనాలనే నమ్ముకున్నారు. అందుకనే 2014 ఎన్నికల్లో 67 సీట్లే వచ్చినా తర్వాత పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవ్వటంతో 2019 ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లొచ్చాయి.





అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమపథకాలను అమలుచేస్తున్నారు. తమ ప్రభుత్వం పనితీరు, పథకాల అమలును జనాలకు వివరించి మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావాలని జగన్ డిసైడ్ చేశారు. ఇందులో భాగంగానే సదీర్ఘకార్యక్రమం గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని డిజైన్ చేసి శ్రీకారం కూడా చుట్టారు. అధికారంలోకి రావాలంటే ప్రజల ఆశీస్సులు మాత్రమే పనిచేస్తుందని జగన్ నమ్ముతున్నారు. అందుకనే రెగ్యులర్ గా జగన్ కూడా జనాల్లోకి వెళుతున్నారు. 





ఇదే సమయంలో ఇంతకాలం ఎల్లోమీడియాను అడ్డంపెట్టుకుని, మీడియా సమావేశాల ద్వారా ప్రభుత్వంపై బురదచల్లిస్తున్నారు చంద్రబాబు. అయితే దీనివల్ల ఉపయోగం లేదని అర్ధమైనట్లుంది. అందుకనే హఠాత్తుగా జిల్లాల టూర్లకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఐదు జిల్లాల్లో పర్యటించారు. ప్రజల ఆశీస్సులు లేకపోతే అధికారంలోకి రావటం కష్టమని చంద్రబాబు తమ్ముళ్ళకు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అందుకనే రెగ్యులర్ గా నేతలంతా ప్రజల్లోనే ఉండాలని చెప్పారు. అయితే జనాలు ఇద్దరిలో ఎవరు చెప్పేది నమ్ముతారు అనేది ఆసక్తిగా మారింది.






అంటే క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే మళ్ళీ అధికారంలోకి రావటానికి జగన్, జగన్ను ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు ఇద్దరు జనాలబాట పట్టడం గమనార్హం. ప్రజల ఆశీస్సులు ఎంత ముఖ్యమో ఇద్దరు అధినేతలు తమ నేతలకు వివరించి చెబుతున్నారు. ప్రజల్లో ఉన్న నేతలకే టికెట్లిస్తామని, నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు తాము సర్వేలు చేయించుకుంటున్నట్లు చెప్పారు. మరి ఇద్దరిదీ ఒకేమాట ఒకేబాట అయినపుడు ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు ? మధ్యలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్ధితి ఏమిటి ? అనేదిపుడు ఆసక్తిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: