జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య విషయాన్ని ఎన్నో మలుపు లు తిప్పారని.. మీరు అధికారంలోకి వచ్చాక ఎందుకు దోషులను శిక్షించ లేదని పవన్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లా అండ్ ఆర్టర్ బలంగా లేకపోతే  క్రిమినల్స్ రెచ్చిపోతారని.. కోడి కత్తి, వివేకా హత్య కేసులలో బాధ్యత తీసుకోవాలని జగన్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సూచించారు. క్రిమినల్ ను పట్టుకోకపోతే  మీరే చేసుకున్నారని ప్రజలు నిర్ధారణకు వస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.


కోడి కత్తి విషయంలో నడిచిన డ్రామా అందరిని ఆశ్చర్యపరిచిందన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌... ఎపి కి ఇచ్చే అప్పులు అన్ని విధాలా పరిమితులు దాటి పోయాయన్నారు. డబ్బులు ఇస్తున్నట్లు వైసిపి వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారని.. ఆర్ధికపరమైన అంశాలలో బ్యూరో క్రాట్స్ నలిగిపోతున్నారని.. అధికారులకు వాయిస్ లేదు, ఛాయిస్ లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వాపోయారు. సినిమా టిక్కెట్ల అంశాన్ని ప్రజలు పెద్ద సీరియస్ గా పట్టించుకోవడం లేదన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. ప్రజలకు దగ్గరయ్యే విధంగా నా  యాత్ర చేపడతానన్నారు.



బిజెపి కి జాతీయ స్థాయిలో మంచి బలం ఉందని.. రాజధాని విషయంలో లో రైతులకు అండగా నిలిచారని.. రాష్ట్రం లో ఉన్న అనేక అంశాలు, అధ్వాన పరిస్థితి కేంద్ర పెద్దలకు తెలుసని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ బీజేపీని వెనుకేసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల పై కేంద్రం జోక్యం చేసుకోదని అంటున్నారని.. విద్యుత్ కొనుగోళ్లు, ఇతర అంశాల పై కేంద్ర పెద్దలు కు చెప్పానని.. బిజెపి, జనసేన సమావేశాలు లో కూడా వైసిపి వైఫల్యాలను చర్చించామని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు.


రాష్ట్ర విభజన వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. హక్కుల గురించి, హామీల గురించి ఎవరూ మాట్లాడటం లేదని గుర్తు చేశారు. స్వప్రయోజనాలు ఆశించకుండా రాష్ట్రం కోసం మాట్లాడరా అని ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. 151సీట్లు ఇస్తే రాష్ట్రం లో మంచి పాలన ఉందా అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: