బ్యాంక్ వడ్డీ రేట్లు రాను రాను సామాన్య ప్రజలకు షాక్ ఇస్తున్నాయి..ఇప్పటికే కొన్ని ప్రముఖ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే.. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ పరిధిలోని బ్యాంక్‌ల వడ్డీ ల పై పెంపు చేశారు.రాబోయే ద్రవ్య విధాన సమావేశాలలో రెపో రేట్లలో కొంత పెరుగుదల ఉంటుందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంకేతాలిచ్చారు.రెపో రేటు పెంపుపై ఎలాంటి పరిమితులు సెంట్రల్ బ్యాంక్ పెట్టుకోలేదని ఆయన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. రేటు ఎంతమేర పెరుగుతుందో చెప్పలేనని.. కానీ అది కొవిడ్ ముందు స్థాయిలకు పెంచటం జరుగుతుందని స్పష్టం చేశారు.
 

రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ఠాలకు చేరిన వేళ మార్కెట్లో లిక్విడిటీని తగ్గించడంలో భాగంగా రిజర్వు బ్యాంక్ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రేటు ఇంచుమించు 5.15 శాతానికి చేరవచ్చని సమాచారం..MPC సమావేశాల్లో RBI వడ్డీ రేట్లను 5.15 శాతానికి పెంచవచ్చని సూచించే ప్రైవేట్ ఆర్థికవేత్తల అంచనాలపై అడిగిన ప్రశ్నకు దాస్ సమాధానమిచ్చారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన సమావేశంలో RBI ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ సంచలన ప్రకటన చేసింది. రానున్న జూన్ MPC సమావేశంలో ద్రవ్యోల్బణంపై bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన అంచనాలను వెల్లడిస్తుందని ఆర్‌బిఐ గవర్నర్ దాస్ తెలిపారు.



మార్చిలో విడుదల చేసిన చివరి అంచనాలు 2023 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణాన్ని 5.7 శాతంగా అంచనా వేసింది.. ఈ ఏడాది చివరికి 6 శాతం వరకూ పెరిగే అవకాశం ఉంటుందని అంచనా..ధరలు పెరిగినప్పటికీ నిలకడగా ఉన్నాయని ఆయన తెలిపారు. దీనికి తోడు ఇతర కారణాల వల్ల కరెంట్ ఖాతా లోటు పెద్దగా పెరగకపోవచ్చని ఆయన తెలిపారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించటంలో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ఉపకరిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం కారణంగా కన్జూమర్ ద్రవ్యోల్బణం 20 బేసిస్ పాయింట్ల మేర తగ్గుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు..ఏది ఏమైనా ఆర్థిక శాఖ వివరాల ప్రకారం నడుచ కోవాలని ఆయన స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rbi