వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేసే నియోజకవర్గం విషయమై పార్టీలోనే చర్చ పెరిగిపోతోంది. తాజాగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోని కీలక నేతలు కొందరు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పవన్ తిరుపతి నియోజకవర్గంలోనే పోటీచేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సమావేశంలో ఒక తీర్మానం కూడా చేశారు. తమ డిమాండు, తీర్మానం ప్రకారం పవన్ గనుక తిరుపతిలో పోటీచేస్తే లక్షఓట్ల మెజారిటి ఖాయమని బల్లగుద్దకుండా చెప్పారు.






నిజానికి 2019 ఎన్నికల్లోనే పవన్ గనుక తిరుపతి నుండి పోటీచేసుంటే కత వేరుగావుండేది. తిరుపతి సీటులో పవన్ పెద్ద కష్టంలేకుండా గెలిచే అవకాశాలుండేవి. ఎలాగంటే అప్పట్లో వైసీపీ తరపున పోటీచేసింది భూమన కరుణాకర్ రెడ్డి. టీడీపీ తరపున పోటీచేసింది సుగుణమ్మ. ఈ ఇద్దరిలో ఎవరికీ కూడా పెద్దగా జనాల్లో  ఇమేజిలేదు. భూమన బాడీ లాంగ్వేజిని వ్యతిరేకించే వాళ్ళు నియోజకవర్గంలో ఎక్కువమందే ఉన్నారు.






తనని తాను మేధావిగా భూమన చాలాకాలంగా ప్రమోట్ చేసుకుంటున్నా ఆయన బాడీ లాంగ్వేజ్ అయితే చాలామందికి నచ్చదు. ఇక సుగుణమ్మంటే జనాల్లో సానుకూలతా లేదు. అప్పట్లో జనసేన తరపున పవన్నే పోటీచేయమని కొందరు సూచించినా వినకుండా చదలవాడ కృష్ణమూర్తిని రంగంలోకి దింపారు. జనాల్లో భూమనపై ఎంత వ్యతిరేకత ఉందంటే రాష్ట్రమంతా అభ్యర్ధులకు వేలకు వేలు మెజారిటి వస్తే భూమన గెలిచింది మాత్రం జస్ట్ 650 ఓట్లతో మాత్రమే.






ఇదే రంగంలో పవన్ ఉండుంటే భూమనకు ఓట్లేయటం ఇష్టంలేని వాళ్ళు, సుగుణమ్మ, చదలవాడకు ఓట్లేయటం ఇష్టంలేని వాళ్ళంతా పవన్ కు ఓట్లేసేవారే. ఎందుకంటే చదలవాడంటే కూడా జనాలకు పడదు. ఈ లెక్కలో బలిజల(కాపు) ఓట్లు ఇటు సుగుణమ్మ, చదలవాడ మధ్య చీలిపోయాయి. ఇంత చీలిపోయినా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గాలి ఉధృతంగా ఉన్నా భూమన బయటపడింది అతికష్టంమీద 650 ఓట్లతోనే అంటేనే ఆయన పరిస్ధితి అర్ధమవుతోంది. నిజంగానే పవన్ అప్పుడు గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. మరిపుడు పోటీచేస్తే లక్ష ఓట్ల మెజారిటితో గెలిపించగలరా ?








మరింత సమాచారం తెలుసుకోండి: