అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన వేములవాడ యువకుడు కంటె యశ్వంత్‌(25) విహార యాత్రకు వెళ్లి అక్కడ సముద్రంలో అలల తాకిడికి మరణించారు.ఈ మేరకు అతని మరణ వార్త గురించి అతని తల్లిదండ్రులకు సమాచారం అందింది. యశ్వంత్‌ మిత్రులు ఇంకా అలాగే కుటుంబసభ్యుల సమాచారం మేరకు.. వేములవాడ సుభాష్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కంటె మల్లయ్య కుమారుడు యశ్వంత్‌ ఎమ్మెస్‌ చదివేందుకు 8 నెలల క్రితం ఫ్లోరిడాకి వెళ్లారు.ఇక వీకెండ్ కావడంతో సరదాగా ఈనెల 29 వ తేదీన యశ్వంత్, అతడి స్నేహితులు శుభోదయ్, మైసూరా, చరణ్, శ్రీకర్ ఇంకా అలాగే శార్వరితో కలిసి ఐర్లాండ్‌లోని దీవులకు వెళ్లారు. ఇక అక్కడే ఓ ప్రైవేట్‌ బోటుని అద్దెకు తీసుకుని పిటా దీవుల వద్దకు చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం పూట 5.35 గంటలకు బోట్‌ స్టార్ట్‌ చేయగా.. దాని ఇంజిన్‌ ఆన్‌ కాలేదు.ఆ అలల తాకిడికి బోటు 3 మీటర్ల లోతు ప్రాంతం నుంచి 25 మీటర్ల లోతు ప్రాంతానికి చేరుకుంది.ఇక పాపం ఇది గమనించని యశ్వంత్‌ నీటిలోకి దిగారు.



అలలు ఎక్కువగా ఉండటంతో ఎంత ఈతకొట్టిన తన బోటును చేరుకోలేకపోయారు. యశ్వంత్‌ను కాపాడేందుకు మిత్రులు ఎంత ప్రయత్నించినా కానీ సాధ్యం కాలేదు. లైఫ్‌ జాకెట్స్‌ ధరించి నీటిలోకి దిగి దాదాపు 3 గంటలపాటు గాలించినా కూడా ఫలితం అనేది లేకుండా పోయింది. దీంతో వారు ఇక ఈ విషయాన్ని యశ్వంత్‌ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మిత్రుడిని కోల్పోయిన దుఃఖంలో వీరంతా కూడా సమీపంలోని వసతి గదులకు చేరుకున్నారు. ఇక పోలీసులు గాలింపు చేపట్టగా.. సోమవారం నాడు రాత్రి మృతదేహం లభ్యం అయినట్లు తెలిసింది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన యశ్వంత్‌ మృతితో సుభాష్‌నగర్‌లో అతని నివాసం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి.బాగా చదువుకోవాలని దేశం కానీ దేశం వెళ్లిన ఈ అబ్బాయి చనిపోవడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ బిడ్డని గొప్ప ప్రయోజకుడిగా చూడాలనుకున్న ఆ తల్లి దండ్రులకు అతని మరణం తీరని లోటుగా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: