ఇప్పటికే ఎండాకాలంలో విద్యుత్ కొరత కారణంగా ఎప్పుడు కరెంటు వస్తుంది ఎప్పుడు పోతుంది అన్నది కూడా తెలియని విధంగా మారిపోయింది పరిస్థితి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి సమయంలో కొన్ని కొన్ని సార్లు ఊహించని విధంగా విద్యుత్ అంతరాయం కలుగుతూ  జనాలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇక్కడ ఒక తొండ చేసిన పనికి ఏకంగా ఎంతో మంది ప్రజలు విద్యుత్ కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

 సరిగ్గా ఉదయం ఎనిమిదిన్నర గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అందరు షాక్ లో మునిగిపోయారు. ఒకవైపు ఎండ వేడి మరోవైపు ఉక్కపోత దీంతో కరెంట్ ఎందుకు పోయింది అంటూ విద్యుత్ సిబ్బంది కి ఫోన్ చేస్తూనే వచ్చారు అందరు. అయితే తమ వైపు ఎలాంటి సమస్య లేదు అంటూ విద్యుత్ సిబ్బంది కూడా చెప్పడం గమనార్హం. ఈ క్రమంలోనే ఐదుగురు లైన్ మెన్లు సచివాలయంలోని విద్యుత్ సిబ్బంది రంగంలోకి దిగి అసలు సమస్య ఎక్కడ వచ్చింది అని గుర్తించే పనిలో పడ్డారు.


 అయితే గంట సమయం గడిచిపోయింది. కానీ సమస్య ఎక్కడ వచ్చింది అనే విషయం మాత్రం తెలియలేదు. కిడి సింగి గ్రామం నుంచి మొదలైన ఈ విద్యుత్ అధికారుల అన్వేషణ డోకులపాడు వరకు సాగింది. ఇక రెండున్నర గంటల అన్వేషణ తర్వాత సమస్య ఏంటి అన్న విషయం గుర్తించారు విద్యుత్ అధికారులు. డోకులపాడు లో ఉన్న చర్చి వద్ద ఒక తొండ చేసినపని విద్యుత్ అంతరాయానికి కారణమైంది అనేది తెలిసింది. విద్యుత్ తీగల మధ్య ఒక తొండ చిక్కుకోవడంని గుర్తించిన సిబ్బంది దాన్ని తొలగించి సరఫరాను పునరుద్ధరించారు. ఇక ఈ విషయం తెలిసినా జనాలు వామ్మో తొండ ఎంత పని చేసింది అంటూ అనుకుంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి:

Vir