క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తున్నా, తాజాగా బహిరంగసభలో మాట్లాడిన తీరు చూసినా జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమిటో అర్ధమైపోతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు తెలిసిపోతోంది. తన మైండ్ గేమ్ లో భాగంగానే పవన్ను దత్తపత్రుడు..దత్తపుత్రుడంటు పదే పదే ఎగతాళి చేస్తున్నారు. జగన్ తీరుతోనే పవన్ను ఏ స్ధాయిలో ర్యాగింగ్ చేస్తున్నారో అర్ధమైపోతోంది.





జగన్ ప్లాన్ ప్రకారం వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవాల్సిందే. చంద్రబాబునాయుడుతో పవన్ చేతులు కలపాలంటే బీజేపీని వదులుకోవాలి. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నంతకాలం టీడీపీతో పొత్తుపెట్టుకునేందుకు పవన్ కు అవకాశంలేదు. ఒకవేళ బీజేపీనే మనసు మార్చుకుని చంద్రబాబుతో చేతులు కలిపే అవకాశం ఉన్నప్పటికీ అది చాలా తక్కువనే చెప్పాలి. సో జగన్ ప్లాన్ ప్రకారం బీజేపీని వదిలేసి పవన్ టీడీపీతో పొత్తుపెట్టుకుంటే అప్పుడు పోటీచేసే ప్రతిపక్షాల సంఖ్య ఎక్కువైనట్లే.






మూడు నాలుగు పార్టీలు కలిపి పోటీచేస్తే కూటమి అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలే అవకాశం తక్కువగా ఉంటుంది. అదే రెండుపార్టీలు ఒకటిగా మరో మూడు పార్టీలు దేనికదే పోటీచేస్తే పోటీచేసే ప్రతిపక్షాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లే లెక్క. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రతిపక్షాల మధ్య చీలిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే టీడీపీ-జనసేన ఒకటిగా, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు దేనికదే పోటీచేస్తాయి.





అయితే ఈ పార్టీల మొత్తం ఓటుబ్యాంకు దాదాపు నిల్లనే చెప్పాలి. ఏదేమైనా ఓట్లలో చీలికైతే అనివార్యమవుతుంది. జగన్ కు కావాల్సిందేమంటే చంద్రబాబు, దత్తపుత్రుడు ఒకటేని రుజువుచేయటం. ఇదే సందర్భంలో ప్రతిపక్షాల ఓట్లలో చీలికలు తేవటం. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎక్కువగా చీలిపోతే మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తుంది. అయితే టీడీపీ-జనసేన పొత్తులో రెండుపార్టీల మధ్య ఓట్ల ట్రాన్సఫర్ ఏమేరకు జరుగుతుందో తెలీదు. ఎందుకంటే కమ్మ-కాపు సామాజికవర్గాల మధ్య ఓట్ల ట్రాన్సఫర్ అనుకున్నంత ఈజీకాదు. అందుకనే పవన్ పై జగన్ మైండ్ గేమ్ అప్లై చేస్తున్నది.



మరింత సమాచారం తెలుసుకోండి: