గత కొన్నేళ్ళుగా ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.కొన్ని వస్తువులు కూడా అదే దారిలో నడిచాయి.కొన్ని దేశాల్లో కూడా చాలా ఖరీదైన వస్తువులు ఉన్నాయి.వాటికి అక్కడ ఫుడ్ డిమాండ్ తో పాటు భారీ కొరత కూడా ఉంది.ప్రపంచవ్యాప్తంగా పాప్కార్న్ స్పైసీ సాస్ శ్రీరాచాకు కొరత ఉంది. జర్మన్ మార్కెట్లో బీర్ కొరత ఉంది. అంతే కాదు జపాన్లో ఉల్లి ధరలు ప్రజలను కంటతడి పెట్టిస్తున్నాయి..
ప్రపంచంలోని సరఫరా విధానంపై ఒత్తిడి ఎక్కువగా ఉంది.



ఒక ఉత్పత్తి సంబంధించిన ముడిసరుకు అందుబాటులో లేకపోతే, అప్పుడు ప్యాకింగ్లో సమస్య ఏర్పాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న లోటుపాట్లకు సరఫరా సమస్యలే కారణమని చాలా కంపెనీలు అంగీకరించాయి. ఈ క్రమంలోనే ఇటీవలి నెలల్లో, జర్మనీలో సీసాలలో విక్రయించే బీర్ ధరలు గణనీయంగా పెరిగాయి. రేటు పెరగడంతో మార్కెట్లోనూ బీర్ కొరత ఏర్పడింది. దీనితో పాటు ఆస్ట్రేలియాలో పాలకూర, జపాన్లో ఉల్లి, సలామీ పరిస్థితి కూడా అలాగే ఉంది. అన్నింటికీ కారణం ప్రపంచ వ్యాప్తంగా వీటిపై ధరలు కూడా భారీగా పెరిగాయి.


ఇలా కొరత రావడానికి అనేక కారణాలు ఉన్నాయి..గాజు సీసాలు, అల్యూమినియం డబ్బాలు తయారు చేసే కంపెనీలు వాటిని తయారు చేయడం లేదు. దీంతో సోడా, బీరు ప్యాక్ కాకపోవడంతో మార్కెట్కు దూరమవుతున్నాయి. దీనితో పాటు షిప్పింగ్ కంటైనర్లు కూడా తక్కువగా ఉన్నాయి. వీటన్నింటి వెనుక, కరోనా మహమ్మారిలో లాక్డౌన్ తర్వాత ఎఫెక్ట్గా నిపుణులు చెబుతున్నారు.


మరోవైపు, అమెరికా కూడా ఈ సంక్షోభం అంటుకుంది. ఇక్కడ అతిపెద్ద కొరత రెస్టారెంట్లో ఉపయోగించే సాస్, శ్రీరాచా, పాప్కార్న్. ఈ సాస్కు అతి పెద్ద బ్రాండ్ అయిన హుయ్ ఫాంగ్ ఫుడ్స్ కూడా ఎగుమతి, దిగుమతుల కారణంగా దాని ఉత్పత్తిని నిలిపివేసిందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే సాస్ చేయడానికి ముడి పదార్థం లేదు. అదే సమయంలో, అమెరికాలో పాప్కార్న్ కొరత కూడా పెద్ద సమస్యగా మారింది. అమెరికా ప్రజలు సినిమా హాల్లో పాప్కార్న్ తినడానికి ఇష్టపడతారు. కానీ ఈ రోజుల్లో పాప్కార్న్ కనిపించడం లేదు. మొక్కజొన్న పంటకు రైతులు దూరం కావడం, ప్యాకేజింగ్ సరుకులు లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.. మొత్తానికి అలా కొరత ఏర్పడింది..


మరింత సమాచారం తెలుసుకోండి: