ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి...ఇప్పటికే పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఏర్పడ్డ వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది.ఓ వైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి.. వీటికి ఆవర్తనాలు తోడవడంతో తెలుగు రాష్ట్రాల సహా అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.


గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, అమరావతిలోని భారత వాతావరణ శాఖ కేంద్రాలు రానున్న రెండు, మూడు రోజులపాటు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వేర్వేరు ప్రకటనల్లో ప్రకటించాయి.ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఉత్తర ద్వీపకల్ప భారతదేశంలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుండి 5.8 కి.మీ ఎత్తులో తూర్పు-పశ్చిమ జోన్ 20 డిగ్రీల ఉత్తరంలో కేంద్రీకృతమై ఉంది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో బుధవారం ఏర్పడిన వాయుగుండం గురువారం ఉత్తర ఒడిశాకు ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించింది.


ఈ నేపథ్యంలో రాగల ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది..ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో, రాయలసీమలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నెల 7, 8, 11 తేదీల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఈ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. ఎటువంటి సమస్యలు ఎదురైనా దగ్గరిలొని అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: