దేశ వ్యాప్తంగా రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే..దాంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి.. భారీగా కురుస్తున్న వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి.. మరోవైపు అల్పపీడనం కూడా బల పడుతుంది. దాంతో తెలుగు రాష్ట్రాల తో పలు రాష్ట్రాలలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి దయనీయంగా మారింది. భారీ వర్షాల కారణంగా జన జీవనం స్తభించి పోయింది.


దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అనేక రాష్ట్రాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజులపాటు ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బుధవారం వరకు ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్‌లలో కురుస్తున్నవర్షాల కారణంగా వరద ముప్పు పెరిగిపోయింది. రోడ్లు జలమయమై, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో అనేక నదులు పొంగిపొర్లుతున్నాయి.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయి. ఒడిశాతో పాటు పశ్చిమ మధ్యప్రదేశ్‌, కర్ణాటక లోని తీర ప్రాంతాల్లో మంగళ, బుధ వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. పశ్చిమ రాజస్థాన్‌ లో సోమవారం, తూర్పు ప్రాంతం లో సోమవారం నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ లోని అనేక ప్రాంతా లకు సోమవారం రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తర, దక్షిణ కర్ణాటక, ఉడుపి, సతారా, పూణె, రాయ్‌గఢ్, తెలంగాణ లోని కొన్ని ప్రాంతాలు, వస్లాడ్, నవసారి, గిర్, సోమ్‌నాథ్, జునాగఢ్‌లకు రాబోయే రెండు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.. వరద ముప్పు ఉంటే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: