వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని గట్టి నమ్మకంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని రీతిలో షాక్ తగలబోతోందట. ఏదో సినిమాలో మొక్కే కదాని..అన్నట్లుగా వైఎస్సీర్టీపీ గ్రహణం తప్పేట్లు లేదని సమాచారం. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితిపై వ్యూహకర్త సునీల్ కానుగోలు అందించిన సర్వే రిపోర్టు చూసి కాంగ్రెస్ పెద్దలకు పెద్ద షాకే తగిలిందట. గాంధీభవన్లో శనివారం, ఆదివారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో జరిగిన పార్టీ సీనియర్ల సమావేశంలో ఇదే విషయమై పెద్ద చర్చే జరిగిందట.





చాలామంది మొదట్లో షర్మిల పార్టీని అసలు లెక్కేచేయలేదు. వైఎస్సీర్టీపీని అసలు రాజకీయపార్టీనే కాదన్నట్లు, షర్మిలను అసలు లెక్క చేయాల్సిన అవసరమే లేదన్నట్లుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీసిపారేశారు. రేవంత్ తో పాటు కాంగ్రెస్ నేతల పరిస్ధితి ఎంత విచిత్రంగా తయారైంది.  ఎలాగంటే ఒకవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ను మహానేతని చెబుతునే మరోవైపు షర్మిలను తీసిపారేసినట్లు మాట్లాడుతున్నారు.





సరే షర్మిల మాత్రం తెలంగాణాకు వైఎస్సార్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటు ఆమె దారిలో ఆమె పాదయాత్ర చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే వైఎస్సార్ అంటే నల్గొండ, ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో చెప్పుకోదగ్గ అభిమానులు, మద్దతుదారులున్నారు. ఇదే విషయాన్ని సునీల్ సర్వే రిపోర్టులో చెప్పారట. మహబాబూనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ కు షర్మిల పార్టీ నుండి గట్టి దెబ్బ తగలబోతోందని స్పష్టంగా చెప్పారట.






దీనికి రెండు కారణాలున్నట్లు సునీల్ తెలిపారట. మొదటిదేమంటే వైఎస్సార్ మరణించిన తర్వాత ఆయనపై అవినీతి ముద్ర వేయటమే కాకుండా కొడుకు జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలుకు పంపారని ఎక్కువమంది జనాలు ఇప్పటికీ అనుకుంటున్నారట. రెండో కారణం ఏమిటంటే షర్మిల పార్టీ పెట్టి వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులను ఏకం చేస్తుండటమే. ఈ రిపోర్టు చూసిన తర్వాతే రేవంత్ వైఎస్సార్ ను మహానేతంటు పొగడటం మొదలుపెట్టారట. సో ఎన్నికల్లో ఎక్కువసీట్లు గెలవకపోయినా కొన్నిచోట్ల కాంగ్రెస్ గెలుపును దెబ్బతీయటం ఖాయమని తేలిపోయింది. మరి కాంగ్రెస్ నేతలు ఏమిచేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: