చిట్టచివరకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు తన పరువు నిలబెట్టుకున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీచేస్తున్న ద్రౌపది ముర్ముతో చంద్రబాబు అండ్ కో సమావేశమయ్యారు. చివరినిముషం వరకు టీడీపీ అదినేత చంద్రబాబు అండ్ కో తో  ద్రౌపది సమావేశమవుతారో లేదో అన్న సస్పెన్స్ మైన్ టైన్ అయ్యింది. అయితే కన్వెన్షన్ హాలులో జగన్మోహన్ రెడ్డి ఆధ్యక్షతన జరిగిన వైసీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న ద్రౌపది తర్వాత చంద్రబాబు అండ్ కో తో కూడా భేటీ అయ్యారు.





నిజానికి టీడీపీ మద్దతు కావాలని ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఎవరు కూడా చంద్రబాబును అడగలేదు. టీడీపీ కూడా 11వ తేదీ మధ్యాహ్నం వరకు తమను మద్దతివ్వమని ఎవరైనా అడుగుతారేమో అని ఎదురుచూసింది. ఎవరు మద్దతు అడగకపోవటం, 12వ తేదీన ద్రౌపది ఏపీకి వస్తుండటంతో చేసేదిలేక తమంతట తాముగానే ద్రౌపదికి మద్దతిస్తున్నట్లు తీర్మానంచేశారు. అలాగే తాము ద్రౌపదికి మద్దతిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ చెప్పారు.





పనిలోపనిగా ఏపీకి వస్తున్న ముర్ముతో తాము కూడా సమావేశమవుతామని రిక్వెస్టు చేశారు. పార్టీ పెద్దలతో మాట్లాడి సమాచారం ఇస్తానని కిషన్ బదులిచ్చారు. అయితే మంగళవారం మధ్యాహ్నం వరకు కిషన్ నుండి సమాచారం రాకపోవటంతో ఏమిచేయాలో చంద్రబాబుకు దిక్కుతోచలేదు. అడగకుండానే మద్దతిచ్చిన అందరిముందు పలుచనవ్వటమే కాకుండా చివరకు ముర్ముతో సమావేశం కూడా కుదరకపోతే తీరని అవమానమనే భావించారు. అయితే తెరవెనుక జరిగిన లాబీయింగ్ కారణంగానే టీడీపీ నేతలతో భేటీ అయ్యేందుకు  ద్రౌపది అంగీకరించినట్లు సమాచారం. 





అయితే తెరవెనుక ఏమైందో ఏమోగానీ మొత్తానికి సాయంత్రం ముర్ము టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కో తో భేటీఅయ్యారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా తనకు మద్దతివ్వాలని రిక్వెస్టుచేశారు. దాంతో చంద్రబాబు పరువు నిలిచినట్లయ్యింది. విచిత్రం ఏమిటంటే టీడీపీ నుండి బీజేపీలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్, చంద్రబాబుతో అంటీముట్టకుండా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని యాక్టివ్ పార్ట్ తీసుకోవటం. ముర్ముతో పాటు కిషన్ రెడ్డి తదితరులున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: