మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ? అన్న సామెతలాగుంది పై హెడ్డింగ్. ఇంతకీ విషయం ఏమిటంటే ఎల్లోమీడియాలో ఫ్రంట్ పేజిలో  బుధవారం సర్వే పేరుతో ఒక కథనం అచ్చయ్యింది. అందులో ఏముందంటే జాతీయస్ధాయిలో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోతోందని తేలిందట. దేశంలోని అందరు సీఎంల పనితీరుతో పోల్చితే జగన్ గ్రాఫ్ అట్టడుగు నుండి 6వ ప్లేసులో ఉందట. అంతాబాగానే ఉంది కానీ సర్వే చేసిందెవరు ? అన్నదే ఇక్కడ కీలక పాయింట్ గా మారింది.





ఇంతకీ సర్వేచేసిందెవరంటే సెంటర్ ఫర్ నేషనల్ స్డడీస్ (సీఎన్ఎస్) అనే సంస్ధ. ఈ సంస్ధకు ఏమైనా క్రెడిబులిటీ ఉందా అంటే ఎవరికీ తెలీదు. మరి దేని ఆధారంగా ఈ సంస్ధ సీఎంల పనితీరును లెక్కేసింది ? అదీ తెలీదు కానీ సర్వే రిపోర్టంటు ఎల్లోమీడియాలో ప్రముఖంగా అచ్చయ్యింది. ఈ సర్వే రిపోర్టుతో పాటు ఇంకేముంది జగన్ పనైపోయిందంటు పిచ్చి రాతలు కూడా జతచేశారు. ఇంతకీ ఈ సంస్ధ ఎవరిది ? ఎవరిదంటే రాబిన్ శర్మదని తేలింది.





ఇంతకీ రాబిన్ శర్మ ఎవరంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీని గెలిపించేందుకు చంద్రబాబునాయుడు ఒప్పందం చేసుకున్న రాజకీయ వ్యూహకర్తే. అంటే రాబిన్ శర్మదే సీఎన్ఎస్ అనే సంస్ధ. టీడీపీ తరపున పనిచేస్తున్న శర్మ ఒక సర్వేచేసి అందులో జగన్ గ్రాఫ్ బాగా పెరుగుతోందని రిపోర్టిస్తారా ? సర్వేనే భోగస్ అని తేలిపోతోంది. పైగా జగన్ కు కిందనుండి 5వ స్ధానమట. విచిత్రం ఏమిటంటే కొద్దినెలల క్రితం బాధ్యతలు తీసుకున్న పంజాబ్  ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు టాప్ టెన్ లో 5వ స్ధానం దక్కటతోనే తేలిపోయింది సర్వే అంతా భోగస్సని.






అబద్ధం చెప్పినా అతికినట్లుండాలని పెద్దలు చెప్పిన విషయం కూడా ఎల్లోమీడియాకు తెలీకపోతే ఎలాగ ? విచిత్రం ఏమిటంటే జగన్ గ్రాఫ్ తగ్గిపోతోందని చెబుతున్నారే కానీ చంద్రబాబు గ్రాఫ్ పెరిగిందని ఎక్కడా చెప్పటంలేదు. దీంతోనే భోగస్ సర్వేలతో చంద్రబాబు గ్రాఫ్ పెరుగుతుందా అనే చర్చ పెరిగిపోతోంది. సర్వే పేరుతో ఏదంటే అది అచ్చేసేస్తే నిజమే అనుకుని నమ్మేరోజులు ఎప్పుడో పోయాయని ఎల్లోమీడియా తెలుసుకోలేకపోవటమే విచిత్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: