నెగిటివ్ వార్తలు, కథనాలపై ప్రతి ఒక్కళ్ళు బ్యాటింగ్ చేయాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. వరద బాధితులను పరామర్శించిన సందర్భంగా అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం ఎంతమంచి చేస్తున్న ఎల్లోమీడియా పట్టించుకోవటంలేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా జనాలకు చెడుగా చూపిస్తున్నట్లు మండిపడ్డారు. ప్రభుత్వం చంద్రబాబునాయుడుతోనో లేకపోతే టీడీపీతో మాత్రమే పోరాటం చేయటంలేదన్నారు.
చంద్రబాబుకు మద్దతుగా ఎల్లోమీడియా కూడా ప్రభుత్వంపై బురదచల్లేందుకు ప్రతిరోజు చాలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్లోమీడియా చల్లేబురదకు వ్యతిరేకంగా ప్రతిఒక్కళ్ళు ఫ్రంట్ ఫుట్ బ్యాంటింగ్ చేయాల్సిందే అని ఆదేశించారు. ప్రభుత్వానికి బ్యాక్ ఫుట్ బ్యాటింగే కాదు అవసరమైతే ఫ్రంట్ ఫుట్ బ్యాంటింగ్ కూడా చేయగలదని నిరూపించాలని గట్టిగా చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరు కలిసే బ్యాంటింగ్ చేయాలన్నారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రభుత్వాన్ని కేవలం నెగిటివ్ యాంగిల్లో మాత్రమే జనాలకు చూపాలనే లైను తీసుకుంది ఎల్లోమీడియా. క్షేత్రస్ధాయిలో ప్రభుత్వం ఎంతకష్టపడుతున్నా, జనాలు ఎంత హ్యాపీగా ఉన్నాసరే పట్టించుకోకుండా కేవలం నెగిటివ్ గా మాత్రమే వార్తలు, కథనాలను వండి వారుస్తోంది. టీడీపీ హయాంలో చంద్రబాబు విపరీతంగా అప్పులుచేసినా కార్పొరేషన్లను కుదవపెట్టి అప్పులు తెచ్చినా ఏనాడూ అక్షరముక్క రాయలేదు. నిధులు మళ్ళించినా పట్టించుకోలేదు. ఇపుడు ఇదే విషయాల్లో జగన్ పై పదే పదే కథనాలు రాస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు హయాంలోనే విపరీతమైన అవినీతి జరిగింది. అప్పుడేమీ బయటపెట్టని ఎల్లోమీడియా ఇపుడు మాత్రం నానా గోలచేస్తోంది.
తాజాగా వరదల విషయాన్ని తీసుకున్నా బాధితులందరికీ సాయం అందిస్తున్నా కూడా ప్రభుత్వం ఏమీ చేయటంలేదన్న వాదననే హైలైట్ చేస్తోంది. ఇక్కడ కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలకే బాగా ప్రాధాన్యతిస్తోంది. ఎక్కడైనా చిన్న ఘటన జరగ్గానే దాన్ని బూతద్దంలో చూపించి బాగా పెద్దదిగా ప్రజెంట్ చేస్తోంది. దీనిపైనే జగన్ సమీక్షలో మాట్లాడుతు అందరు ఫ్రంట్ ఫుట్ బ్యాంటింగ్ చేయాలని గట్టిగా చెప్పింది.