రాజకీయాల్లో ప్రత్యర్ధులు ఎప్పుడు కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తునే ఉంటారు. కొన్నిసార్లు కొందరు సక్సెస్ అయితే ఇంకొన్నిసార్లు మరికొందరు విజయం సాధిస్తారు. గెలిచినా ఓడినా ఎత్తుకు పై ఎత్తులు అయితే సాగుతునే ఉండాలి. అలాకాకుండా చతికిలపడిపోతే ప్రత్యర్దులు బుల్డోజర్లాగ తొక్కుకుపోతుంటారంతే. ఇపుడిదంతా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తులకు చంద్రబాబునాయుడు ఫై ఎత్తులు వేయలేకపోతున్నారు.






ఇప్పుడికాదు ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా జగన్ పన్నిన ఉచ్చులో తగులుకుని చంద్రబాబు విలవిల్లాడిపోయారు.  అప్పట్లో ప్రత్యేకహోదా విషయంలోనే చంద్రబాబు ఎన్నిసార్లు యూటర్న్ లు తీసుకున్నారో అందరుచూసిందే. అదంతా జగన్ ఎత్తులను తట్టుకోలేక చివరకు జనాలముందు చీపైపోయారు. పోనీ జగన్ అధికారంలోకి వచ్చారు కదా చంద్రబాబు ఏమైనా బ్రహ్మాండమైన ఎత్తులు వేస్తున్నారా అంటే అదీలేదు. ఇపుడు కూడా జగన్ దెబ్బకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గిలగిల్లాడిపోతున్నారు.






చంద్రబాబు ప్రధానంగా ఎల్లోమీడియాను మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ సామాజికవర్గాలను అంటే హోలుమొత్తంమీద జనాలను నమ్ముకుని రాజకీయంచేస్తున్నారు. దాంతో చంద్రబాబు చాలా ఇబ్బందులు పడుతున్నారు. లేటెస్టుగా హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ విషయమే తీసుకుందాం. ఎంపీ న్యూడ్ వీడియోను పట్టుకుని ఎల్లోమీడియాతో కలిసి  చంద్రబాబు అండ్ కో మొత్తం వైసీపీకి చుట్టేద్దామని ప్రయత్నంచేస్తోంది. అవసరంలేకపోయినా జగన్ను వివాదంలోకి లాగుదామని చూసింది. అయితే వివాదం చివరకు కమ్మ-కురబ సామాజికవర్గాల మధ్య సమస్యగా మారిపోయింది.






చంద్రబాబు అండ్ కో కురబ కులానికి వ్యతిరేకమన్నట్లుగా ముద్రపడిపోయింది. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ కురబ సామాజికవర్గం ఓట్లు చాలావున్నాయి. అందుకనే అనంతపురం జిల్లాలోని చాలామంది టీడీపీ నేతలు అసలు మాధవ్ ఇష్యూని టేకప్ చేయలేదు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలోని చేనేతల్లో కీలకనేత అయిన గంజిచిరంజీవి టీడీపీకి రాజీనామా చేయటం కొంచెం దెబ్బనేచెప్పాలి. గంజి చేనేత సామాజికవర్గంలో కీలకనేత. అలాగే కోనసీమ జిల్లాలో అంబేద్కర్ పేరుమీద జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. ఎస్సీ-కాపుల గొడవగా ముదిరిపోయింది. అంటే జగన్ బీసీలు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సామాజికవర్గాలనే నమ్ముకున్నారు. మరి చంద్రబాబు ఈ విషయం ఆలోచించకుండా కేవలం ఎల్లోమీడియాను మాత్రమే నమ్ముకుంటే ఉపయోగమేంటి ?







మరింత సమాచారం తెలుసుకోండి: