జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాగే సెకండ్ లెఫ్టినెంట్ అని పాపులరైన నాదెండ్ల మనోహర్ కూడా అడ్డదిడ్డంగానే మాట్లాడుతున్నారు. పవన్ అయినా మనోహర్ అయినా కేవలం జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత ధ్వేషంతో మాట్లాడుతున్నట్లే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఐటి వింగ్ కార్యకర్తలతో సమావేశమైంది. పార్టీ బలోపేతానికి ఐటి వింగ్ సేవలు ఎలా అందించాలి, ఎలాంటి బాధ్యతలను నెరవేర్చాలని మాట్లాడుకుంటు తప్పుపట్టాల్సిన అవసరంలేదు.





కానీ జగన్ విధానాల వల్లే ఏపీకి ఐటి కంపెనీలు రావటంలేదని, వచ్చినవి పారిపోతున్నాయని, ఎవరైనా వచ్చి కంపెనీ పెట్టాలంటే భయపడిపోతున్నారంటు ఆరోపణలుచేశారు. ఈ ఆరోపణలన్నీ చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా గడచిన మూడేళ్ళుగా చేస్తున్నవే అని అందరికీ తెలుసు. జగన్ విధానాల వల్ల లేదా పాలనకు భయపడి పారిపోయిన కంపెనీల లిస్టు చెప్పమంటే చెప్పారు. రావాలని అనుకుని ఆగిపోయిన కంపెనీల పేర్లు చెప్పమంటే చెప్పరు. ఎంతకాలమైనా కంపెనీలు పారిపోతున్నాయి, కంపెనీలు రావటంలేదనే ఊకదంపుడు ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు.





నాదెండ్ల చెప్పిందే నిజమైతే మరి గడచిన మూడేళ్ళుగా ఏపీకి వచ్చిన కంపెనీల మాటేమిటి ? నెల్లూరు, శ్రీసిటి, గోదావరి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్, కడప, కర్నూలు జిల్లాల్లో వచ్చిన యూనిట్లు ఎలావచ్చాయి ? వైజాగ్ లో కూడా టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యాంపస్లు ఎలా ఏర్పాటవుతున్నట్లు ?





ఇక నాదెండ్ల ముఖ్యంగా చేసిన ఆరోపణలు ఏమిటంటే హైదరాబాద్ లో ఐటి రంగం ఎలా డెవలప్ అవుతోంది ? ఏపికి యూనిట్లు ఎందుకు రావటంలేదో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. నిజానికి హైదరాబాద్ కు ఏపీకి పోలికలేదు. ఎందుకంటే హైదరాబాద్ అన్నది తెలంగాణాకు వడ్డించిన విస్తరిలాంటిది. గడచిన ఎనిమిదేళ్ళల్లో హైదరాబాద్ ను కేసీయార్ ప్రత్యేకించి చేసిన డెవలప్మెంట్ ఏమిటో వీళ్ళు చెప్పగలరా ? నాదెండ్ల, చంద్రబాబు, పవన్ లాంటి వాళ్ళంతా ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి కేసీయార్ పాలనగురించి మాట్లేందుకు ధైర్యంచేయటంలేదు. హైదరాబాద్ మినహా తెలంగాణాలో డెవలప్ అయిన మరో నగరాన్ని వీళ్ళంతా చూపగలరా ?



మరింత సమాచారం తెలుసుకోండి: