అసలు విషయం పక్కకుపోయి కొసరు విషయమే కీలకమైపోయింది.  సర్క్యులేషన్లో ఉన్న హిందుపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో విషయంలో చంద్రబాబునాయుడు అండ్ కో గట్టిగా తగులుకుంటున్నట్లే ఉంది. మాధవ్ వీడియోను అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే దాన్ని ఒరిజనలే అని సర్టిఫై చేసినట్లు టీడీపీ అధికారప్రతినిధి పట్టాబి మీడియా సమావేశంలో చెప్పారు. చెప్పటమే కాకుండా సదరు సర్టిఫికేట్ ను రిలీజ్ చేశారు.





అయితే మూడురోజులు తిరక్కుండానే ఆ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ అని తేలిపోయింది. టీడీపీ రిలీజ్ చేసిన సర్టిఫికేట్ ను ఏపీసీఐడీ మళ్ళీ ఎక్లిప్స్ ల్యాబ్ కు పంపింది. అయితే సదరు సర్టిఫికేట్ ను తాను జారీచేయలేదని ల్యాబ్ ఓనర్ జిమ్ స్టాఫోర్డ్ చెప్పారని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మీడియాతో చెప్పారు. అంతేకాకుండా జిమ్ సీఐడీకి ఇచ్చిన ఈ మెయిల్ కాపీని కూడా రిలీజ్ చేశారు.





సీన్ కట్ చేస్తే ఇదే విషయమై మాజీమంత్రి పేర్నినాని మీడియాలో మాట్లాడుతు చంద్రబాబు, లోకేష్ పట్టాభి, అనిత, సర్టిఫికేట్ ను ట్యాంపర్ చేసిన పోతిన ప్రసాద్ తదితరులపై ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు. బీసీ సామాజికవర్గానికి చెందిన మాధవ్ పై టీడీపీ కక్షకట్టినట్లు ఆరోపించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని మాధవ్ మొదటినుండి మొత్తుకుంటున్నా వినకుండా చంద్రబాబు, లోకేష్, పట్టాభి, అనిత అందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నట్లు నాని మండిపడ్డారు.





మాధవ్ పేరుతో  సర్క్యులేషన్లో పెట్టిన  వీడియోని టీడీపీయే సృష్టించిందని పేర్ని ఆరోపించారు. ఫేక్ వీడియోలు సృష్టించటం, తప్పుడు సర్టిఫికేట్లను సృష్టించి ప్రత్యర్ధులను గబ్బుపట్టించటం చంద్రబాబు అండ్ కో కు మామూలే అన్నారు. తమ ఎంపీపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నందుకు చంద్రబాబు అండ్ కోపై పోలీసుల దగ్గర ఫిర్యాదుచేయాలని తాము డిసైడైనట్లు చెప్పారు. నిజంగానే వైసీపీ తరపున ఎవరైనా ఫిర్యాదుచేస్తే వెంటనే పోలీసులు కేసు నమోదుచేసి యాక్షన్ తీసుకోవటం ఖాయం. పోలీసులు యాక్షన్లోకి దిగితే మళ్ళీ టీడీపీ ఏమిగోల చేస్తుందో చూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: