ప్రతిసారి తెలుగుదేశంపార్టీ ఏదో చేయబోతే అదికాస్తా ఇంకేదో అయిపోతోంది. వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గబ్బుపట్టించాలనే ఆతృతలో తాను గబ్బుపడుతోంది. హిందుపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో వ్యవహారంలో కూడా టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. మాధవ్ కు సంబంధించి సర్క్యులేషన్లో వీడియోను పట్టుకుని టీడీపీ నానా యాగీచేస్తోంది. అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, అది మార్ఫ్ చేసిన వీడియో అని ఎంపీ మొత్తుకుంటున్నారు.





ఒకవైపు మాధవ్ పై చర్యలు తీసుకోవాలని గోలచేస్తునే మరోవైపు హఠాత్తుగా టీడీపీ అధికారప్రతినిధి పట్టాభి మీడియా సమావేశంపెట్టి ఒక రిపోర్టు రిలీజ్ చేశారు. అదేమిటంటే అమెరికాలోని ఎక్లిప్స్ పేరుతో ఉన్న ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టట. మాధవ్ వీడియోను తాము అమెరికాలోని ల్యాబుకు పంపితే అది ఒరిజనలే అని చెప్పిందని పట్టాభి చెప్పారు. దాంతో గొడవ మరింత పెద్దదయ్యింది. అయితే అనూహ్యంగా గురువారం మరో విషయం వెలుగులోకి వచ్చింది.





తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే ఎక్లిప్స్ రిపోర్టుపేరుతో టీడీపీ సర్క్యులేట్ చేస్తున్న రిపోర్టే ఫేక్ రిపోర్టట. ఈ విషయాన్ని ఏపీసీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మీడియాతో చెప్పారు. టీడీపీ సర్క్యులేషన్లో పెట్టిన ఎక్లిప్స్ రిపోర్టును తాము అమెరికాలోని ఆ కంపెనీకి పంపారట. దాని ఓనర్ జిమ్ స్టాఫోర్డ్ తో మాట్లాడారట. అయితే తనకు వచ్చిన వీడియోలో ఎక్కడా కట్ కానీ ఎడిటింగ్ కానీ జరగలేదని మాత్రమే తాను చెప్పినట్లు జిమ్ చెప్పారట. అంతేకానీ సదరు వీడియో ఒరిజనలే అని తాను ఎక్కడా చెప్పలేదన్నారని సునీల్ చెప్పారు





తనపేరుతో టీడీపీ సర్క్యులేట్ చేస్తున్న రిపోర్టు ఫేక్ రిపోర్టని కూడా జిమ్ తమకు ఈ మెయిల్ ద్వారా చెప్పారని సునీల్ చెప్పారు. ఫేక్ రిపోర్టు సర్క్యులేషన్లో పెట్టిన వాళ్ళపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సునీల్ హెచ్చరించారు. సో, టీడీపీ రిలీజ్ చేసిన రిపోర్టే ఫేక్ రిపోర్టని ఇపుడు తేలిపోయింది. తప్పుడు ఆరోపణలు చేయటంలో, తప్పుదు రిపోర్టును చెలామణిచేయటంలో టీడీపీది అందెవేసిన చేయిగా వైసీపీ ఎదురుదాడి మొదలుపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: