అవుననే అంటోంది ఎల్లోమీడియా. ఎక్కడ ఏ ఘటన జరిగినా వెంటనే దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాధించేసి ప్రభుత్వంపై బురదచల్లేయటమే ఎల్లోమీడియా టార్గెట్ గా పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే జగన్ కు ఏమాత్రం సంబంధంలేని సినిమా ఫ్లాపులకు కూడా జగనే కారణమని అచ్చేసి వదిలేస్తోంది. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఫ్లాపైంది. అయితే ఆ ఫ్లాపుకు సినిమా యూనిట్ కానీ నిర్మాతలైన చిరంజీవి కుటుంబం కానీ చాలా కారణాలనే చెప్పాయి.






అయితే తాజాగా ఎల్లోమీడియా మాత్రం ఆచార్యా ఫెయిల్యూర్ కు జగనే కారణమని తేల్చేసింది. ఎందుకంటే సినిమా సమస్యలపై చర్చించేందుకు జగన్ దగ్గరకు వెళ్ళిన చిరంజీవి చేతులుజోడించి నమస్కారం పెట్టారట. దాన్ని జనాలు తట్టుకోలేకపోయారట. జగన్ పై జనాల్లో బాగా వ్యతిరేకత ఉందని ఎల్లోమీడియా తేల్చేసింది. చిరంజీవంతటి వ్యక్తి జగన్ ముందు చేతులు జోడించి వేడుకోవటాన్ని జనాలు జీర్ణించుకోలేకపోయారట. అందుకనే జగన్ మీదకోపాన్ని ఆచార్య సినిమా మీద చూపించారని ఎల్లోమీడియా పరమసత్యాన్ని బయటపెట్టింది.





అసలు సినిమా హిట్ అవటానికి, ఫెయిలవ్వటానికి ప్రభుత్వానికి ఏమన్నా సంబంధం ఉంటుందా ? సినిమాలో సరుకులేకపోతే ఎంతటి పెద్ద హీరో నటించిన సినిమానైనా జనాలు తిరస్కరించేస్తారని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. ఆచార్య సినిమా ద్వారా జనాలకు ఏమి చెబుదామని దర్శకుడు అనుకున్నాడో, చివరకు ఏమి చూపించాడో దర్శక, నిర్మాతలకే అర్ధంకాలేదు. మరా సినిమా ఫ్లాప్ కాకుండా ఎలా హిట్టవుతుంది ?





జగన్ తో భేటీలో చిరంజీవి చేతులు జోడించి నమస్కరించటానికి సినిమా ఫెయిల్యూర్ కు ముడేయటంలోనే అర్ధమైపోతోంది జగన్ పైన ఎల్లోమీడియాకు ఎంత కసుందో. ఇక్కడ టార్గెట్ ఏమిటంటే జగన్ పై బురద చల్లటమే. అందుకనే చిరంజీవి సినిమాను అడ్డంపెట్టుకుని జగన్ పై బుర్రకు తోచినట్లు రాసి అచ్చేశారంతే. అంటే జగన్ పై వ్యతిరేకంగా రాయటానికి ఎల్లోమీడియాకు మ్యాటర్ ఏమీ లేదన్న విషయం స్పష్టమైపోయింది. అందుకనే చివరకు సినిమా ఫెయిల్యూర్ కు కూడా జగనే కారణమని చెప్పేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: