రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఒక భారీ పరిశ్రమను కేటాయిస్తే దాన్ని కూడా అడ్డుకునేంత స్ధాయికి టీడీపీ దిగజారిపోయిందా ? టీడీపీ సినియర్ నేత యనమల రామకృష్ణుడు పార్క్ కేటాయింపును రద్దుచేయాలని కేంద్రానికి రాసిన లేఖ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశంలో మూడు పార్కులను డెవలప్ చేయాలని కేంద్రం డిసైడ్ చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ ఇస్తే పార్కుల కోసం 16 రాష్ట్రాలు పోటీపడ్డాయి. ఇందులో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఏపీ సక్సెసయ్యాయి.





ఇన్ని రాష్ట్రాలతో పోటీపడి ఏపీకి పార్క్ వచ్చినందుకు జనాలు సంతోషిస్తుంటే టీడీపీ మాత్రం తెగబాధిపోతోంది. తమ హయాంలో ఎలాంటి ప్రాజెక్టులు రాకపోయినా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసినట్లు డప్పుకొట్టుకున్న చంద్రబాబునాయుడు ఇపుడు దాదాపు రు. 9 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు ఏపీకి వస్తే దాన్ని తట్టుకోలేకపోతున్నారు. కాలుష్యం వస్తుందని, కాకినడ జిల్లాలోని తొండంగి మండలంలో జాలర్ల ఉపాధి దెబ్బతింటుందనే సొల్లు కారణాలతో కేంద్రానికి లేఖ రాశారు.





నిజంగా బల్క్ డ్రగ్ పార్క్ వల్ల అంతటి కాలుష్యం రావటమే నిజమైతే మరి అన్ని రాష్ట్రాలు పార్కు కోసం ఎందుకంతగా పోటీపడ్డాయి. ఏ ఫ్యాక్టరీ వచ్చినా, డ్రగ్ ఇండస్ట్రీ పెట్టాలన్నా కొంత నష్టం తప్పదు. ఇపుడీ పార్క్ నుండి కాలుష్యం వస్తుందని అనుకుంటే దాన్ని అధిగమించేందుకు మార్గాలేమిటో చూడాలి కానీ అసలు పార్కే వద్దనుకుంటే ఇక డెవలప్మెంట్ ఎలాగ ? పైగా పార్కులో ఏర్పాటుకాబోయే ఫార్మాకంపెనీల యూనిట్లన్నీ అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాల్సిందే.






పార్క్ లో ఏర్పాటయ్యే  ప్రతియూనిట్ వాతావరణ కాలుష్యాన్ని అధిగమించేదుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటాయనే అనుకోవాలి. 2 వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ ఫార్క్ ఏర్పాటవుతోందంటే వేలాదిమందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉద్యోగ, ఉపాధి దక్కుతుంది. ఇక  ఆ చుట్టుపక్కల ప్రాంతం ఎంతవేగంగా డెవలప్ అవుతుందో చెప్పక్కర్లేదు. 2022లో పనులు మొదలుపెట్టినా ఒక షేపుకు వచ్చేందుకు కనీసం ఐదేళ్ళు పడుతుంది. భూమిని, మౌళిక సదుపాయాలను కల్పించటం వరకే ప్రభుత్వం బాధ్యత. యూనిట్ల నిర్మాణం, డ్రగ్ తయారీ అంతా ఫార్మా కంపెనీల పని. కాబట్టి ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తుందని అనుకుందాం.


 

మరింత సమాచారం తెలుసుకోండి: