చంద్రబాబునాయుడుకే కాదు చివరకు ఎల్లోమీడియాకు కూడా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేయాలని చంద్రబాబు ఎన్నిసార్లు పిలుపిచ్చినా చాలామంది తమ్ముళ్ళు పెద్దగా పట్టించుకోవటంలేదు. ఇదే విషయాన్ని ఈమధ్యనే జరిగిన విస్తృతస్ధాయి సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నేతలందరికీ ఫుల్లుగా క్లాసుపీకారు. మూడున్నరేళ్ళు నేతలంతా హ్యాపీగా ఇళ్ళల్లోనే పడుకున్నారని ఇపుడు కూడా పడుకునే ఉంటామంటే ఎన్నికల తర్వాత మనందరం ఇళ్ళల్లోనే పడుకోవాలని మండిపోయారు.






పార్టీ అధినేతగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్న చంద్రబాబు తననేతల విషయంలో ఆగ్రహం వ్యక్తంచేసినా, క్లాసులు పీకినా లేదా నేతలవైఖరిపై ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడినా  అర్ధముంది. కానీ ఇదే విధమైన పద్దతిలో ఎల్లోమీడియా కూడా మాట్లాడితే దానికి అర్ధమేంటి ? చివరకు చంద్రబాబు కూడా అనని మాటలను ఎల్లోమీడియాలో ఒక ఛానల్ ఎండీ అన్నారంటే వాళ్ళల్లో కూడా ఫ్రస్ట్రేషన్ ఎంతగా పెరిగిపోయిందో అర్ధమైపోతోంది. సదరు ఎండీ డిబేట్లో మాట్లాడుతు ’తెలుగుదేశంపార్టీ నేతలంతా చచ్చిపోయారు.. సైనైడ్ మింగి చచ్చిపోయార’ని రెచ్చిపోయారు.





ఎందుకు చచ్చిపోయారంటే అసలు బతికున్నారా లేదా అన్న విషయం తెలీటంలేదట. సీనియర్ నాయకుల నుండి జూనియర్ నాయకుల వరకు అందరు సైనైడ్ తినేసి చచ్చిపోయారట. పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, మంత్రులైపోతాం, ఎంఎల్ఏలు అయిపోతామని చెప్పుకునే నేతలంతా చచ్చిపోరాయట. 2024లో చంద్రబాబు మహా అయితే సీఎం అవుతారు..ఆయన సీఎం అయితే ఏంటి కాకపోతే ఏంటని నేతలు చెప్పుకుంటున్నారట.





అలాగే లోకేష్ కూడా మహా అయితే మళ్ళీ మంత్రవుతారు..ఆయన మంత్రయితే ఏమిటి కాకపోతే తమకేమిటనే ధోరణి నేతల్లో పెరిగిపోయిందట. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల సంగతిని పక్కనపెట్టినా కృష్ణాజిల్లా నేతల గురించి మాట్లాడాలంటేనే తనకు సిగ్గేస్తోందన్నారు. సరే ఇంకా చాలానే మాట్లాడారు కానీ ఇక్కడ గమనించాల్సిందేమంటే సదరు ఎండీ టీడీపీ నేతలను రెచ్చగొడుతున్నట్లే ఉన్నారు. నానారకాల మాటలంటే అయినా నేతల్లో పౌరుషం పొంగుకొచ్చి రోడ్లపైకి వస్తారేమో అని అంత ఘాటుగా మాట్లాడినట్లున్నారు. అయినా చంద్రబాబు చెబితేనే రోడ్లపైకి రాని నేతలు సదరు ఛానల్ ఎండీ మాటలకు రోడ్లపైకి వచ్చేస్తారా ?



మరింత సమాచారం తెలుసుకోండి: