చిన్నపాముని కూడా పెద్దకర్రతో కొట్టాలన్నది చంద్రబాబునాయుడు ఆలోచన. ఈ పద్దతిలోను ప్రతి విషయంలోను చంద్రబాబు రాజకీయం చేస్తుంటారు. తాజాగా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేయటంలో కూడా ఇదే రాజకీయం చేస్తున్నారు. నిజానికి యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరున్నా డాక్టర్ వైఎస్సార్ పేరున్నా మామూలు జనాలకు ఎలాంటి తేడావుండదు. కానీ ఇక్కడ రాజకీయమే ప్రధాన ఎజండా అయిపోయింది కాబట్టే ఎన్టీయార్ పేరు మార్చటాన్ని చంద్రబాబు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు.





ఊరూరా తమ్ముళ్ళు నానా రచ్చ చేస్తున్నారు. యూనివర్సిటీకి  తిరిగి ఎన్టీయార్ పేరుపెట్టేంతవరకు ఊరుకునేదిలేదని చంద్రబాబు ప్రకటించారు. దీన్నిబట్టి ఎన్టీయార్ పేరుతో రాజకీయం చేసి జనాల్లోకి వెళ్ళాలన్న ప్లాన్ అర్ధమవుతోంది. సీఎంగా ఉన్న ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి మానసికంగా ఇబ్బందులుపెట్టి చివరకు ఆయన చనిపోవటానికి చంద్రబాబుతో పాటు యావత్ కుటుంబసభ్యులే కారణం. అలాంటిది ఇపుడు ఎన్టీయార్ పేరు మార్చటాన్ని ఎంతగా రాజకీయం చేస్తున్నారో అందరు చూస్తున్నదే.





కొద్దిరోజుల క్రితం భార్య భువనేశ్వరి గురించి అసెంబ్లీలో తప్పుగా మాట్లాడారంటు నానా రచ్చచేశారు. మీడియా సమావేశంలో భోరున ఏడ్చారు. భార్యగురించి తప్పుగా మాట్లాడింది అసలు టీడీపీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీయే. ఇప్పటికీ వంశీపైన చంద్రబాబు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. తన భార్యను వైసీపీ ఎంఎల్ఏలు అవమానించారంటు గోలగోల చేసి రాష్ట్రమంతా తిరిగి సానుభూతి కోసం ట్రైచేశారు. ఎవరూ పట్టించుకోకపోయేసరికి వేరేదారి లేక కామయిపోయారు.





అంటే చంద్రబాబు విషయంలో అర్ధమవుతున్నదేమంటే ఎన్టీయార్ అయినా ఆయన కూతురు భువనేశ్వరి అయినా పబ్లిసిటీ మెటీరియల్ మాత్రమే. సానుభూతి వల్ల పదిఓట్లు వస్తాయని అనుకుంటే జనాలముందు ఎంతసేపు ఏడ్వడానికైనా చంద్రబాబు వెనకాడరు. తన సొంతలాభం కోసం ఎన్టీయార్, భువనేశ్వరి పరువును రోడ్డున పడేయటానికి ఏమాత్రం మొహమాటపడరు. చంద్రబాబు లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఇంకెవరైనా ఉన్నారా అనేది అనుమానమే. మిగిలిన విషయాలు ఎలాగున్నా సెంటిమెంటును వాడుకోవటంలో మాత్రం చంద్రబాబును మించిన నేతలు ఇంకోరుండరేమో. మరీ తాజా వివాదం ఎక్కడదాకా వెళుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: