ఒక్కసారిగా సీన్ రివర్సయిపోవటంతో కాంగ్రెస్ పార్టీ జాతీయఅధ్యక్ష పదవి రేసులోనుండి రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఔటయిపోయారు. సోనియాగాంధీతో జరిగిన భేటీలో ఆమె గెహ్లాట్ కు ఫుల్లుగా క్లాసు పీకారట. తెరవెనుక నుండి తన మద్దతుదారులతో ఓవర్ యాక్షన్ చేయించటమే కాకుండా జరిగిన ఘనలతో తనకు సంబంధంలేదని, తాను ఎవరినీ కంట్రోల్ చేయలేనని చెప్పిన విషయం తెలిసిందే.
సొంతరాష్ట్రంలో మద్దతుదారులనే కంట్రోల్ చేయలేని నేత ఇక కాంగ్రెస్ అధ్యక్షుడిగా దేశాన్ని ఎలా కంట్రోల్ చేయగలరని గెహ్లాట్ ను సూటిగానే సోనియా అడిగారట. సోనియా ప్రశ్నకు గెహ్లాట్ ఏమీ సమాధానం చెప్పలేక చివరకు క్షమాపణలు చెప్పారట. గెహ్లాట్ నాటకాలన్నీ అర్ధమైన తర్వాత అధ్యక్షుడి రేసులో నుండి తప్పుకోమని స్వయంగా సోనియానే ఆదేశించారని సమాచారం. దాంతో భేటీ తర్వాత మీడియాతో గెహ్లాట్ మాట్లాడుతు అద్యక్షపదవి పోటీనుండి తప్పుకుంటున్నట్లు ఆయనే ప్రకటించారు.
ఇక మిగిలింది ముఖ్యమంత్రి పదవి మాత్రమే. ఇదికూడా తొందరలోనే ఊడిపోయేట్లే ఉంది. ఎందుకంటే తన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరుండాలనే విషయంలో సోనియా ఒకటి తలస్తే గెహ్లాట్ మాత్రం మరోటి తలచారు. సోనియా నిర్ణయాన్ని అడ్డుకునేందుకు తన మద్దతుదారులతో దాదాపు తిరుగుబాటు చేసినంత పనిచేయించారు. సీఎల్పీ సమావేశానికి ప్యారలెల్ గా మద్దతుదారులు ప్రత్యేకంగా సమావేశమవ్వటం, గెహ్లాట్ తప్ప మరోకరిని సీఎంగా అంగీకరించమని తీర్మానం చేసి అధిష్టానానికి పంపటంతో సోనియాతో పాటు సీనియర్లందరికీ మండింది.
అప్పుడు చేసిన ఓవరాక్షన్ ఫలితంగానే ఇపుడు అధ్యక్షుడి రేసులో నుండి తప్పుకున్నారు. ఇక ముఖ్యమంత్రిగా కూడా గెహ్లాట్ ను తప్పిస్తే కానీ మరో నేతకు గుణపాఠంగా ఉండదు. అయితే అధ్యక్షుడి రేసులో నుండి తప్పించిన కారణంగా గెహ్లాట్ నే సీఎంగా కంటిన్యు చేయిస్తే అధిష్టానం పరువు పోయినట్లే. కాబట్టి మిగిలిన నేతలకు ఒక గుణపాఠంగా ఉండాలంటే గెహ్లాట్ ను సీఎంగా కూడా తప్పించాల్సిందే తప్ప వేరేమార్గం లేదు. మరి సోనియా ఏమి చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది.