అక్కడే అసలు సమస్య మొదలు అవుతుంది. ఇలాంటి ఎమ్మెల్యేలు పార్టీ నుండి బయటకు వెళ్ళడానికి మొగ్గు చూపుతుంటారు. కానీ కొందరు అయితే వేంటనే బయట పడిపోతారు.. కానీ మరికొందరు మాత్రం ఎన్నికల సమయం వరకు ఆగి.. ఒకవేళ తమకు సీటు కేటాయించకపోతే అప్పుడు జంప్ అవడానికి రెడీ అవుతారు. ఇక ఇటీవల కూడా సీఎం జగన్ వరుసగా మీటింగ్ లు పెట్టి పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను మందలించారు. ఇప్పటి వరకు హెచ్చరికలు వరకే జరిగాయి.. మిగిలిన ఈ కాస్త సమయంలో ప్రజలతో కలవకుండా తమ పనితీరును నిరూపించుకోకపోతే ఉద్వాసన తప్పేలా లేదు.
ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు ముందగానే పక్కదారి పడుతున్నారట. ఆయన పార్టీ మారడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఇది కనుక జరిగితే వైసీపీ నుండి వెళ్ళిపోయినా మొదటి ఎమ్మెల్యే దొరబాబు అవుతారు. అయితే ఈయన ఏ పార్టీలోకి వెళుతారు అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం దొరబాబు జనసేన లోకి వెళ్ళడానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారట.