ఈనెల 15వ తేదీన జేఏసీ అధ్వర్యంలో జరగబోతున్న ప్రజాగర్జనకు కౌంటరుకు జనసేన, టీడీపీ పెద్ద ప్లాన్ చేస్తున్నట్లే ఉన్నాయి. అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ నాయకత్వంలో విశాఖలో ప్రజాగర్జన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ప్రజాగర్జన సక్సెస్ కాకుండా నీరుగార్చేందుకే జనసేన, టీడీపీ ప్లాన్ చేస్తున్నట్లు అనుమానంగా ఉంది.





ఎందుకంటే మొదట జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ప్రయత్నం మొదలుపెట్టారు. సరిగ్గా బహిరంగసభ జరిగేరోజే విశాఖలో పవన్ జనవాణి కార్యక్రమం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. 15, 16,17 తేదీల్లో జనసేన నేతలు, శ్రేణులతో పవన్ భేటీ అవబోతున్నారు. నిజానికి ఈ కార్యక్రమాలను ప్రజాగర్జన తర్వాత కూడా పవన్ పెట్టుకోవచ్చు. కానీ బహిరంగసభ జరిగే రోజే తాను పోటీ సమావేశం పెడుతున్నారంటే అర్ధమేంటి ? వైసీపీతో పవన్ పంతానికి పోతున్నట్లే ఉంది చూస్తుంటే. 





జనసేన వ్యవహారం ఇలాగుంటే తాజాగా టీడీపీ కూడా దాదాపు ఇలాంటి సమావేశాన్నే ఏర్పాటుచేసింది. సరిగ్గా 15వ తేదీనే అమరావతికి, పాదయాత్రకు మద్దతుగా టీడీపీ నేతృత్వంలో విశాఖలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. అంటే పవన్ నిర్వహించబోయే జనవాణి కార్యక్రమం, టీడీపీ నిర్వహించబోతున్న రౌండ్ టేబుల్ సమావేశం ప్రజాగర్జనను ఫెయిల్ చేయటానికే అని అర్ధమైపోతోంది.




ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖపట్నంకు వెళ్ళి మూడు రాజధానుల కాన్సెప్టుకు వ్యతిరేకంగా పవన్, టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా ? అన్నది అనుమానంగా మారింది. తమ ఊరిని డెవలప్ చేస్తానని ప్రభుత్వం అంటే ఎవరైనా వద్దంటారా ? పైగా అమరావతికి మద్దతుగా విశాఖకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలోకి తొందరలోనే రైతుల పాదయాత్ర ప్రవేశించబోతోంది. ఆసమయంలో గొడవలు జరుగుతాయేమోననే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇదంతా సరిపోదన్నట్లు జనసేన, టీడీపీ కార్యక్రమాలు. మొత్తానికి పాదయాత్ర ముగిసేలోగా విశాఖపట్నంలో ఏదో జరగబోతోందనే అనుమానాలైతే బాగా పెరిగిపోతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: