మాములుగా దేవుడి ఆలయాలకు వెళ్ళినప్పుడు కొందరు కానుకలు,ముడుపుల తో పాటు విరాళాలను కూడా ఇస్తూ ఉంటారు. వాటిని ఆలయ నిర్మాణ పనులకు ఉపయోగిస్తారు..కొన్నిసార్లు కొంతమంది చెక్ ల రూపంలో కూడా డబ్బులను ఇవ్వడం మనం చూసే ఉంటాము..తాజాగా ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి భారీ విరాళం అందింది..సీన్ కట్ చెస్తె అసలు ట్విస్ట్ ఎదురైంది.ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు అన్నదానం లేదా ఇతర సౌకర్యాల కల్పన కోసం పెద్ద పెద్ద సంస్థలు లేదా, ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు కోట్లలో కూడా విరాళాలు ఇస్తారు..
సాధారణంగా పెద్దమొత్తంలో నగదు ఇచ్చినప్పుడు లేదా చెక్కు రూపంలో ఇచ్చినప్పుడు వాటిని ఆలయ అధికారులకు అందజేస్తారు. పేరు తెలియకూడదని ఎవరైనా భావిస్తే నగదు హుండీల్లో వేస్తారు. చాలావరకు చెక్కులను హుండీలో వేయకుండా నేరుగా అధికారులకు అందజేస్తారు. తాజాగా తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టిన అధికారులకు ఓ చెక్కు కన్పించింది. అది చూసిన అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఆలయం హుండీ లెక్కిస్తున్న సమయంలో నాణేలను, నోట్లు, ఇతర కానుకలను సిబ్బంది వేరువేరుగా లెక్కించారు. ఈ క్రమంలో వారికి ఓ చెక్కు కనపడింది. దానిపై 'అక్షరాలా వంద కోట్ల రూపాయలు' అని రాసి ఉంది. దీంతో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వందకోట్ల విలువైన చెక్కును హుండీలో చూసి ఆశ్చర్యపోయారు. పైగా దానిపై ఆర్మీ జవాన్ల కోసం అని రాసి ఉంది. ఇంత మొత్తం విరాళంగానా అని అనుమానం వచ్చిన ఆలయ అధికారులు ఆ చెక్కు విషయమై ఆరా తీసారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ చెక్కు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వరంగల్ శాఖకు చెందినదిగా గుర్తించారు.ఆ చెక్కు హుండీలో వేసిన వ్యక్తి ఖాతాలో కేవలం రూ.23 వేల మాత్రమే ఉన్నట్లు తేలింది. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. చెక్కు హుండీలో వేసిన సదరు వ్యక్తి అలంపూర్ మండలానికి చెందినవాడిగా గుర్తించారు.కోర్టు దీనిపై విచారణ జరిపి అతన్ని ఆసుపత్రిలో చేర్పించాలని కొరగా,అధికారులు అతన్ని హైదరాబాద్ ఎర్రగడ్డ లో చేర్పించారు..