రైతులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను అందిస్తూ వస్తుంది.. రైతుల అభివృద్ధి కోసం కీలక నిర్ణయాల ను తీసుకుంటూ వస్తున్నారు.మోడీ ప్రభుత్వం.. ఇటీవల కిసాన్ క్రెడిట్ కార్దులను ఇవ్వడం తో పాటు,లోన్ లను కూడా ఇచ్చి రైతుల కు సహాయం చేసిన మోడీ ఇప్పుడు మరోసారి వారికి తీపి కబురును చెప్పారు. దీపావళికి ప్రభుత్వం ఇచ్చే పెద్ద గిఫ్ట్ అనే చెప్పాలి. కొన్ని పంటలకు సంబంధించిన వాటిని ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం తో పాటు ధాన్యం కొనుగోలు కూడా చేస్తుంది.. ఈ మేరకు ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. విషయానికొస్తే..


దేశంలోని రైతులందరికీ శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపున కు ప్రోత్సాహం లో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ) రబీ పంటల కు మద్దతు ధర పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రబీ సీజన్‌ 2022-23(జూలై-జూన్‌), మార్కెటింగ్‌ సీజన్‌ 2023-24 కాలానికి గానూ ఎంఎస్‌పీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది సీసీఈఏ. గోదుమ లకు క్వింటాలుకు రూ.110, ఆవాలు క్విటాలుకు రూ.400 పెంచింది.

తాజా పెంపుతో గోదుమలు 2021-22 లో క్వింటాలుకు రూ.2015 ఉండగా, ప్రస్తుతం రూ.2,125 కు చేరింది. ఆవాలు క్వింటాలుకు రూ.5,450 కి చేరింది. రబీ పంటకాలాని కి గోదుమల పెట్టుబడి వ్యయం రూ.1,065 గా అంచనా వేసింది కేంద్రం.

ఎటువంటి పంటకు ప్రభుత్వం ఎంత పెంచింది అనేది ఒకసారి చూస్తే..
మసూర్ పప్పుకు రూ.500
 గోధుమల కు రూ.100
బార్లీ రూ.100,
శనగలు రూ.150
 సన్ ఫ్లవర్ రూ.209
ఆవాలు రూ.400 రూపాయలు..
దీపావళి కన్నా ముందే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు...


మరింత సమాచారం తెలుసుకోండి: