వద్దుపొమ్మని జనసేన అధినేత పవన్ కల్యాన్ చెబుతున్నా బీజేపీ నేతలు వినటంలేదు. లేదు లేదు మాతోనే మీరు కలిసుండాలంటు వెంటపడుతున్నారు. చిన్నపిల్లల చేష్టల్లాగ కనబడుతోంది కమలనాదుల చేష్టలంతా. తాజాగా ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దియోధర్ మాట్లాడుతు జనసేన, బీజేపీ కలిసే ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమరెండు పార్టీలు కలిసే పోటీచేస్తయని నమ్మబలుకుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి పవన్ అడిగిన రోడ్డుమ్యాప్ రెడీ అవుతోందంటున్నారు.





ఒకవైపేమో బీజేపీని పవన్ ఛీ కొడుతున్నారు. మీతో అసలు స్నేహమే వద్దపొమ్ముంటున్నారు. తన స్ధాయిని తగ్గించుకుని మరీ మిత్రపక్షంగా కలిసుంటే అసలు మర్యాదే ఇవ్వరా అంటు ఖయ్యిమంటున్నారు. తాను బీజేపీకి ఊడిగంచేసే రకం కాదని స్పష్టంగా ప్రకటించేశారు. ఇకనుండి బీజేపీతో రాంరాం అంటు నమస్కారం పెట్టేశారు. అయినా సరే పవన్న అన్నమాటలను కమలనాదులు తుడిచేసుకున్నారు.





పవన్ తమను ఎన్నిమాటలన్నా తామిద్దరం ఇంకా మిత్రపక్షాలమే అంటు భుజనాలు తడుముకొంటున్నారు. కుటుంబపార్టీలతో తాము కలిసేది లేదన్న మాటమీద బీజేపీ నిలబడుంది. అందుకనే తాము చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకునేది లేదంటు దియోధర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు పవన్ టీడీపీ అధినేత చంద్రబాబుతో చేతులు కలిపేశారు. తొందరలోనే కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ, జనసేన నేతలు కలిసి యాక్షన్ ప్లాన్ రెడీ చేయబోతున్నారు.





అందరి కళ్ళముందే పవన్ వైఖరి ఇంత స్పష్టంగా కనబడుతున్నా ఇంకా బీజేపీ నేతలు మాత్రం పవన్నే పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారో అర్ధం కావటంలేదు. టెక్కలిలో జనసేన పార్టీ ఆఫీసు ధ్వంసం ఘటనలో కూడా బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సాంఘీభావం పలికారు. రెండుపార్టీలు కలిసే ప్రభుత్వం దౌర్జన్యాలను ఎదుర్కొంటామంటు చెప్పటమే విచిత్రంగా ఉంది. మీతో స్నేహం వద్దుమొర్రో అని పవన్ మొత్తుకుంటున్నా బీజేపీ మాత్రం లేదు లేదు తమతోనే ఉండాలంటు పట్టుబడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఏపీలో బీజేపీ పరిస్ధితి ఎంత దయనీయంగా ఉందో తాజా పరిణామాలతో అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: