ఏపీ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నెన్నో పథకాలను అందిస్తూ వస్తూన్నారు..ఇప్పటికే ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొని వచ్చారు.ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది..జగనన్న గోరుముద్ద పథకంలో కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే పౌష్టికాహారం నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ, ఎప్పటికప్పుడు పథకాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు 10 రోజులకు ఒకసారి చొప్పున నెలకు మూడుసార్లు పాఠశాలలకు కోడి గుడ్లను సరఫరా చేసేవారు. అయితే దీని వల్ల కోడి గుడ్ల నాణ్యత దెబ్బతింటుందని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే సరఫరాలో మార్పులు చేసి ఆదేశాలు జారీ చేసింది. 



గుడ్ల నాణ్యత దెబ్బతినకుండా వారానికోసారి తాజా గుడ్లను సరఫరా చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం జగనన్న గోరుముద్ద పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు ఉడికించిన గుడ్లను మధ్యాహ్న భోజనంగా అందజేస్తున్నారు. కోడి గుడ్లు ప్రతి వారం వివిధ రంగులతో సరఫరా చేయబడుతున్నాయి. తద్వారా నాణ్యమైన గుడ్లు పంపిణీ చేయబడతాయి. 



గుడ్లు వరుసగా నెలలో మొదటి వారం నీలం రంగులో, 2వ వారం గులాబీ రంగులో, 3వ వారానికి ఆకుపచ్చ రంగులో, 4వ వారంలో వైలెట్ రంగులో ఉంటాయి. పాఠశాలల్లో ఈ విధంగా వచ్చే గుడ్లనే ప్రధానోపాధ్యాయులు దిగుమతి చేసుకోవాలి. గుడ్ల సైజు తగ్గినా పాఠశాలల్లో గుడ్లు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఐఎంఎంఎస్ యాప్‌లో గుడ్ల సైజు, రంగు స్టాంపింగ్ ఉన్న గుడ్లు, స్టాంపింగ్ లేని గుడ్లు తదితర వివరాలను నమోదు చేయాలని నిబంధన పెట్టారు. విద్యార్థులకు అందించే నాణ్యమైన పౌష్టికాహారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది..మంచి గుడ్లను సరఫరా చేసెందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: