
ప్రైవేట్ బ్యాంక్ లలో ఒకటి హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఈ బ్యాంక్ తన కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు.. ఇప్పటివరకు ఎన్నో స్కీమ్ లను అందిస్తున్నారు.ఇప్పుడు తాజాగా మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ ఎఫ్డీ రేట్లు పెంచడం ఈ నెలలో ఇది వరుసగా రెండో సారి కావడం గమనార్హం. బ్యాంక్ రేట్ల పెంపు నిర్ణయం అక్టోబర్ 26 నుంచే అమలులోకి వచ్చింది. అంటే ఈరోజు నుంచే వడ్డీ రేట్లు పెరిగాయి.బ్యాంక్ తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. రూ. 2 కోట్లలోపు ఎఫ్డీలకు ఈ రేట్ల పెంపు వర్తిస్తుంది.
61 రోజుల నుంచి 89 నెలల ఎఫ్డీలపై బ్యాంక్ ఇదివరకు 4 శాతం వడ్డీ రేటును అందించేది. అయితే ఇప్పుడు ఈ వడ్డీ రేటు 4.5 శాతానికి చేరింది. అంటే వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్ల మేర పెరిగిందని చెప్పుకోవచ్చు..90 రోజుల నుంచి 6 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చూస్తే.. బ్యాంక్ ఇప్పుడు 4.5 శాతం వడ్డీని అందిస్తోంది. ఇదివరకు ఈ వడ్డీ రేటు 4.25 శాతంగా ఉండేది. అలాగే 6 నెలల ఒక్క రోజు నుంచి 9 నెలలలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 5.25 శాతం వడ్డీని పొందొచ్చు. ఇదివరకు ఈ వడ్డీ రేటు 5 శాతంగా ఉంది. 9 నెలల ఒక్క రోజు నుంచి ఏడాదిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 5.5 శాతం లభిస్తోంది.
15 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.1 శాతం వడ్డీ రేటు ఉంది. 15 నెలల నుంచి రెండేళ్ల ఎఫ్‌డీలపై 6.15 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. రెండేళ్ల ఒక్క రోజు నుంచి ఐదేళ్ల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.25 శాతంగా ఉంది. అలాగే బ్యాంక్ ఐదేళ్ల నుంచి పదేళ్ల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.2 శాతంగా ఉంది. బ్యాంక్ ఈ వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఇకపోతే సీనియర్ సిటిజన్స్‌కు 50 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీ లభిస్తుంది. వీరికి 3.5 శాతం నుంచి 6.95 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.వడ్డీ రేటు 4.5 శాతం నుంచి 6.25 శాతం వరకు ఉంది. 6 నెలల నుంచి 120 నెలల వరకు టెన్యూర్‌తో డబ్బులను ఆధా చేసుకోవచ్చు...