తాజాగా తమ్ముళ్ళతో చంద్రబాబునాయుడు జరిపిన సమీక్ష చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. కుప్పం, మంగళగిరి, కర్నూలు, ఇచ్చాపురం నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు మొదటినుండి కేవలం అభివృద్ధి మాత్రమే తెలిసిన కుప్పం ప్రజలకు ఇపుడు వైసీపీ అరాచకాలు కొత్తగా ఉన్నాయట. మొదటినుండి ఆదర్శనియోజకవర్గంగా ఉన్న కుప్పంలో హింస, అరాచకాలు కొత్తగా ఉన్నాయట. తానెప్పుడూ కుప్పంలో హింసా రాజకీయాలను అనుమతించలేదని చెప్పారు.





కుప్పంలోని నేతలంతా కలిసికట్టుగా పనిచేయకపోతే ఇబ్బందులు తప్పవంటు హెచ్చరించారు. కుప్పంలోని టీడీపీ నేతలను నైతికంగా దెబ్బతీసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు మండిపడ్డారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇన్ని సంవత్సతరాలుగా కుప్పంలో చంద్రబాబు తరపున వార్ వన్ సైడే అన్నట్లుగా ఉండేది. గడచిన మూడు దశాబ్దాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా కుప్పంను ప్రత్యేకంగా పట్టించుకోలేదు కాబట్టి నియోజకవర్గంలో చంద్రబాబు ఏమనుకుంటే అది సాగిపోయింది. ప్రత్యర్ధిపార్టీ నుండి అసలు ప్రతిఘటనే లేదుకాబట్టి చంద్రబాబు హ్యాపీగా ఉండేవారు.





కానీ రాష్ట్రవిభజన తర్వాత మారిన రాజకీయపరిస్ధితుల కారణంగా 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కుప్పంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాల్సిందే అని గట్టిగా డిసైడ్ అయ్యారు. అప్పటినుండే చంద్రబాబుకు కుప్పంలో సమస్యలు మొదలయ్యాయి. స్ధానికసంస్ధల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేయటంతో మొదలైన చంద్రబాబు కలవరం మున్సిపాలిటిలో కూడా వైసీపీయే గెలవటంతో తారాస్ధాయికి చేరుకుంది. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమపథకాల అమలులో జగన్ ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నారు. దాంతో రేపటిఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాననే నమ్మకం చంద్రబాబులో తగ్గిపోతోంది.






ఒకపుడు ఏడాదిలో కుప్పంకు ఒకసారి వెళితే అదేగొప్పగా ఉండేది. అలాంటిది ఇపుడు ప్రతి రెండునెలలకు మూడురోజులు క్యాంపేస్తున్నారు. చంద్రబాబులో పెరిగిపోతున్న కలవరానికి ఇదే నిదర్శనం. ఇదే విషయం తాజాసమీక్షలో బయటపడింది.  కుప్పం నిజంగానే ఆర్శంగా నిలుస్తుంటే కుప్పం మున్సిపాలిటికి ఇప్పటివరకు మంచినీటి సౌకర్యం జగన్ ఎందుకు కల్పించాల్సొచ్చింది ? కుప్పంను మున్సిపాలిటిగా చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు ? నాడు-నేడు కార్యక్రమంలో వేలాది స్కూళ్ళు ఇపుడే ఎందుకు బాగుపడుతున్నాయో చంద్రబాబు చెప్పగలరా ? 

మరింత సమాచారం తెలుసుకోండి: