ఏపీ సీఐడీ నుంచి నోటీసులు వచ్చిన అనంతరమే బీ.ఆర్ నాయుడు అజ్ఞాతంలో కి వెళ్లారని అంటున్నారు. ఐదారు రోజులుగా బీ.ఆర్ నాయుడు టీవీ 5 సిబ్బందికి కానీ.. బంధుమిత్రులకు ఎవరికి అందుబాటు లో లేరని సమాచారం. అంతేకాదు తనకు ఇచ్చిన సీఐడీ నోటీసుపై స్టే కోరుతూ బీ.ఆర్ నాయుడు ఏపీ హైకోర్ట్ ని ఆశ్రయించారు.. అయితే ఉన్నత న్యాయస్థానం స్టే కూడా మంజూరు చేసింది. కోర్ట్ స్టే విధించినా సరే బీ.ఆర్ నాయుడు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లడం అనుమానాలకు దారి తీస్తుంది.
అసలు బీ.ఆర్ నాయుడు అజ్ఞాతంలో కి ఎందుకు వెళ్లారు. ఏపీ సీఐడీ నోటీసులకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారా లేక మరే కారణమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది. హై కోర్ట్ నుంచి స్టే ఆర్డర్ వచ్చినా సరే ఈ కేసు విషయమై ఆయన కనిపించకుండా వేళ్లారని అనుకోవడం మాత్రం ఆశ్చర్యకరం గా ఉంది. అసలు బీ.ఆర్ నాయుడు ఎక్కడికి వెళ్లారు..? ఎందుకు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు..? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే ఆయన కనిపించాల్సిందే.