ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు అన్ని కూడా తమ కస్టమర్లకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతూ వస్తున్నారు.రేపటి నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయని తెలుస్తుంది.నవంబర్ నుంచి ప్రముఖ బ్యాంకులు అన్నీ కూడా వడ్డీ రేట్ల పై గుడ్ న్యూస్ ను చెప్పనున్నాయి.. తాజాగా ఇండియన్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ప్రభుత్వ ఆధీనంలోని ఈ బ్యాంకు తన కస్టమర్లను ఆకర్షించేందుకు వడ్డీ రేట్లను భారీగా పెంచింది. బ్యాంకు కొత్త వడ్డీ రేట్లు రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. ఇది అక్టోబర్ 29 నుండి అమలులోకి వచ్చింది.
ఈసారి ఈ పెంపుదల 0.90 శాతం పెరిగింది. 2 కోట్ల లోపు ఎఫ్‌డిపై ఈ సదుపాయం ఇవ్వనున్నట్లు బ్యాంక్ తెలిపింది. బ్యాంకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని చెల్లిస్తోంది. బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఖాతాదారులు ప్రయోజనం పొందనున్నారు. ఈ వడ్డీ రేట్ల పెరుగుదల ఎక్కువగా ఉంది. అందుకే ఈ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లయితే మంచి వడ్డీ రేటును పొందవచ్చు.
సాధారణ కస్టమర్ 46 రోజుల నుండి 90 రోజుల ఎఫ్‌డీపై 3.25 శాతం వడ్డీని పొందుతారు. 91 రోజుల నుండి 120 రోజుల ఎఫ్‌డీపై 3.50 శాతం వడ్డీ. 121 రోజుల నుండి 180 రోజుల ఎఫ్‌డీలపై, సాధారణ కస్టమర్ 3.85 శాతం వడ్డీని పొందవచ్చు. సాధారణ కస్టమర్ 181 రోజుల నుండి 9 నెలల ఎఫ్‌డీలపై 4.50 శాతం వడ్డీ. సాధారణ కస్టమర్ 9 నెలల నుండి 1 సంవత్సరానికి ఎఫ్‌డీపై 4.75 శాతం వడ్డీ. సంవత్సరానికి ఎఫ్‌డీపై 6.10 శాతం వడ్డీ.
1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు ఎఫ్‌డీపై సాధారణ కస్టమర్ 6.30 శాతం వడ్డీని పొందుతారు. 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 సంవత్సరాల వరకు ఎఫ్‌డీపై సాధారణ కస్టమర్ 6.50 శాతం వడ్డీ పొందవచ్చు. సాధారణ కస్టమర్ ఎఫ్‌డీ పై 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు 6.40 శాతం వడ్డీని పొందుతారు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఎఫ్‌డీపై సాధారణ కస్టమర్లు 6.30 శాతం వడ్డీని పొందుతారు..ఇది నిజంగానే గుడ్ న్యూస్ అనే చెప్పాలి..