అల్పపీడనం ప్రభావం తో దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. ఈశాన్య రుతు పవనాలు మరింతగా చురుగ్గా కడులుతుండటం తో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంతటా ఈ నెల 4వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ మేరకు ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత చోట్లకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు, బాపట్ల ప్రకాశం, నంద్యాల, వైఎస్సార్ కడప , అన్నమయ్య జిల్లాల తో పాటు కేంద్రపాలిత ప్రాంతం యానాం లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది.. కోస్తా తమిళ నాడు, పొరుగు ప్రాంతల పై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఆయా ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టాని కి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

 

విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇక అల్లూరి సీతారామ రాజు, విజయవాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూల్, అనంతపూర్, శ్రీసత్యసాయి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లా ల్లో అక్కడక్కడ జల్లులు పడే అవకాశ ముందని చెప్పింది. కాగా, చెన్నై, నెల్లూరు, తిరుపతి జిల్లా ల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటం తో.. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతేనే బయటికి వెళ్లాలని అధికారులు సూచించారు. మత్స్య కారులు మరో రెండు రోజులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.. ఎప్పటికప్పుడు ప్రాంతపు పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని అధికారులు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: