చిన్న విషయాన్ని పట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలు ఎంత యాగీచేయాలో అంతా చేసేశాయి. ఒక న్యూసెన్స్ కేసును జనసేన అధినేత పవన్ కల్యాణ్ హత్యకు కుట్రగా మార్చేసి గోలగోల చేశాయి. ఇదిగో పులంటే అదిగో తోకన్నట్లుగా తయారైపోయింది ఏపీలో రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి అంటే నిలువెత్తు ధ్వేషంతో ఉన్న ప్రతిపక్షాలకు ఎల్లోమీడియా ఊతంగా నిలవటంతో ప్రతిరోజు గొడవలైపోతున్నాయి.





ఇంతకీ విషయం ఏమిటంటే జనసేన అధినేత  పవన్ కల్యాణ్ ఇంటిముందు మూడురోజుల క్రితం ముగ్గురు యువకులకు పవన్ సెక్యూరిటి సిబ్బందితో గొడవైంది.  జూబ్లీహిల్స్ లో పవన్ ఇంటికి దగ్గరలోనే ఉన్న పబ్బులో ముగ్గురు యువకులు ఫుల్లుగా మందుకొట్టేశారు. కారులో బయలుదేరిన వాళ్ళు పవన్ ఇంటిముందు ఆగారు. పవన్ ఇంటిముందు కారును తీసేయమని సెక్యురిటీ సిబ్బంది చెప్పినపుడు మాటమాట పెరిగి గొడవైంది. చివరకు ఒకళ్ళమీద మరొకళ్ళు దాడిచేసి కొట్టుకున్నారు.





ఇదే విషయమై సెక్యూరిటి సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు యువకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. నిజానికి ఇది న్యూసెన్స్ గొడవ మాత్రమే. దీన్నే పార్టీ నేత నాదెండ్లమనోహర్ తమ అధినేత పవన్ను హత్యచేయటానికి రెక్కీగా ఆరోపించారు. దాంతో చంద్రబాబునాయుడు, సోమువీర్రాజు, ఎల్లోమీడియా బాగా వివాదాస్పదం చేసేశాయి. మూడురోజులు ఏపీలో ఇదే విషయమై పెద్ద గొడవైపోయింది. తీరా పోలీసులు దర్యాప్తు చేసి తేల్చిందేమంటే ఇది ఉత్త న్యూసెన్స్ కేసు మాత్రమేనని.





జరిగిన ఘటనను విచారించిన పోలీసులు పవన్ హత్యకు రెక్కీలేదు ఏమీలేదని తేల్చేశారు. పవన్ హత్యకు జగన్ కుట్రచేస్తారా అంటు ఊగిపోయిన చంద్రబాబు ఇపుడేమని సమాదానం చెబుతారు ? హత్యకు రెక్కీ అంటు జనసేనకు మద్దతిచ్చే కాపులు కూడా నానా రచ్చ చేసేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డయితే రెండుప్రభుత్వాలు అడిగితే దర్యాప్తు చేయించటానికి కేంద్రం రెడీ అంటు ప్రకటించేశారు. తీరాచూస్తే వడ్లగింజలో బియ్యపుగింజలాగ తేలిపోయింది వ్యవహారం మొత్తం. ఏమీలేని చోటకూడా ఎంతకంపు చేయాలో ప్రతిపక్షాలు అంతా చేసేస్తున్నాయని మరోమారు బయటపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: