ప్రత్యర్ధులపైన ఏదో ఒక ఆరోపణలతో రెచ్చిపోదామంటే ఇపుడు కుదరటంలేదు. పైగా ప్రత్యర్దులపైన చేస్తున్న ఆరోపణల్లాంటివే తమ దగ్గరు కూడా పెట్టుకున్నపుడు మాట్లాడకుండా ఉండటమే ఉత్తమం. అలాకాదని ఏదో ఒక బురదచల్లేద్దామని ప్రయత్నిస్తే ఇపుడు ఐవైఆర్ కృష్ణారావు విషయంలో అయినట్లే అవుతుంది. ఐవైఆర్ అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డిపైన ట్విట్టర్ వేదికగా చేసిన ఆరోపణలే ఇపుడు రివర్సులో నరేంద్రమోడీకి తగులుతున్నాయి.





ఇంతకీ విషయం ఏమిటంటే జగన్ కు మధ్యంతర ఎన్నికలకు వెళ్ళక తప్పేట్లు లేదట. ఎందుకంటే భూములన్నింటినీ జగన్ తాకట్టుపెట్టేస్తున్నారట. ఇంతకు ముందు సీఎంలుగా చేసిన వారికి ఇంత తెలివితేటలు లేకపోయాయే అని తెగ బాధపడిపోయారు. వ్రతం చెడిన ఫలితం దక్కేట్లు లేదని కూడా ఎద్దేవాచేశారు. నిజానికి ఈయనగారు చీఫ్ సెక్రటరీగా ఎలా పనిచేశారో అర్ధంకాదు. ఎందుకంటే భూముల తాకట్టు, అమ్మకాలు జగన్ తో నే మొదలుకాలేదు.





2014-19 మధ్య చంద్రబాబునాయుడు కూడా చాలా కార్పొరేషన్లను తాకట్టుపెట్టారు. చాలా భూములను అమ్మేశారు. మరికొన్ని భూములను కారుచౌకగా సంస్ధలకు అప్పగించారు. అవన్నీ ఐవైఆర్ చీఫ్ సెక్రటరీగా ఉన్నపుడు జరిగినవే. తాను చీఫ్ సెక్రటరీగా ఉన్నపుడు చంద్రబాబు అమ్మేసినవి, తాకట్టుపెట్టినవి గుర్తులేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక జగన్, చంద్రబాబు సంగతిని పక్కనపెట్టేస్తే నరేంద్రమోడీ ఏకంగా కీలక సంస్ధలనే అమ్మేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్ధలను అమ్మేయటం ద్వారా రు. 6 లక్షల కోట్లను సమీకరించాని టార్గెట్ పెట్టుకున్నది ఐవైఆర్ కు  తెలీదా ?






ఇప్పటికే చాలా సంస్ధలను మోడీ సర్కార్ అమ్మేసింది. అమ్మకానికి పెట్టిన వాటిల్లో విశాఖ స్టీల్స్ కూడా ఉన్న విషయాన్ని ఐవైఆర్ మరచిపోయినట్లున్నారు.  ఒకవైపు మోడీ ప్రభుత్వం సంస్ధలను అమ్మేస్తుంటే  ఆ విషయాన్ని వదిలేసి జగన్ కుదవపెడుతున్న విషయాన్ని మాత్రమే ప్రస్తావించటంలో అర్ధమేంటి ? ఈ విషయంలోనే ఐవైఆర్ వైఖరిని నెటిజన్లు దుమ్ముదులిపేస్తున్నారు. ఐవైఆర్ ట్వీట్ తో జనాలంతా మోడీ నిర్వాకాన్ని ఎండగడుతున్నారు. మొత్తంమీద జగన్ మీద చేసిన ట్విట్ చివరకు రివర్సయి మోడీ పరువునే బజారున పడేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: