ప్రస్తుత రోజుల్లో అన్నీ మారుతున్నాయి.. అదే విధంగా బ్యాంకింగ్ సేవలు కూడా పూర్తిగా మారిపొయాయి.. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా తన బ్యాంకుకు సంబంధించిన పనిని సెటిల్ చేసుకోవడాని కి బ్రాంచ్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చోని ఆన్ లైన్ లోనే అన్నీ పనులు చేస్తున్నారు. ఇప్పుడు మీరు మెసేజింగ్ యాప్ వాట్సాప్ ద్వారా ఇంట్లో కూర్చొని బ్యాంకింగ్ సేవల ప్రయోజనాన్ని సులభంగా పొందవచ్చు. ఇటీవలి కాలం లో దేశంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్ వంటి అనేక బ్యాంకులు తమ కస్టమర్లకు కోసం వాట్సాప్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించాయి. 



ఇప్పుడు ఈ జాబితా లో మరో బ్యాంకు పేరు చేరింది. ఈ బ్యాంక్ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్.ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వాట్సాప్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన కస్టమర్ల కు వాట్సాప్ బ్యాంకింగ్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను మాత్రమే ఉపయోగించి వాట్సాప్‌ లో చాట్ చేయడం ద్వారా బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌తో పాటు మరెన్నో బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు..


ఆ సేవల గురించి పూర్తీ వివరాలు..


*.బ్యాంక్ బ్యాలెన్స్ చెక్


*. ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్
*. మొబైల్ బిల్ రీఛార్జ్
*. యుటిలిటీ బిల్లు చెల్లింపు
*. లోన్ కోసం దరఖాస్తు (లోన్ అప్లికేషన్)
*. 24×7 బ్యాంకింగ్ సౌకర్యాల ప్రయోజనం


 ముందుగా ఎయిర్‌ టెల్ పేమెంట్స్ బ్యాంక్ వాట్సాప్ బ్యాంకింగ్ అధికారిక నంబర్ 8800688006 ని సేవ్ చేయండి. దీని తర్వాత మీ రిజిస్టర్డ్ నంబర్ నుండి హాయ్ అని పంపండి. ఆ తర్వాత మీకు అందుబాటు లో ఉన్న సేవల్లో ఒకదాన్ని ఎంచుకోండి. ఆ సేవను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి

మరింత సమాచారం తెలుసుకోండి: