జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాలిని ఎల్లోమీడియా తీసేసింది. రెండురోజులు ఇప్పటం గ్రామంలో ఇళ్ళు కూల్చివేతంటు పవన్ తో పాటు నానా రచ్చచేసిన ఎల్లోమీడియా ఇపుడు రూటుమార్చింది. హెడ్డింగుల్లో మాత్రం ఇళ్ళు కూల్చివేతంటు రాసిన ఎల్లోమీడియా లోపలంతా ఇళ్ళముందున్న నిర్మాణాలను, కాంపౌండ్ వాల్సును మాత్రమే అధికారులు కూల్చారని చెప్పింది. అంటే మూడురోజులపాటు బాగా రచ్చచేసి పవన్ను ఆకాశానికి ఎత్తేసిన ఎల్లోమీడియా ఒక్కసారిగా కిందపడేసింది.






మొదటినుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ ఎంత గోలచేస్తున్నది అందరు చూస్తున్నదే. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టినట్లు చెపిందంతా అబద్ధమని ఎప్పుడో తేలిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నా ఆధికారంలో ఉన్నా పవన్ ప్రశ్నించింది, ప్రశ్నిస్తున్నదంతా జగన్ను మాత్రమే అని అందరికీ అర్ధమైపోయింది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయటం దేశం మొత్తంమీద ఏపీలో మాత్రమే జరిగింది. ఆ రికార్డు పవన్ కు మాత్రమే దక్కుతుంది.





చంద్రబాబునాయుడు రాజకీయ ప్రయోజనాలకోసమే ఒకవైపు పనిచేస్తు మరోవైపు సమాజాన్ని ఉద్దరించటానికే తాను పోరాటాలు చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వటం పవన్ కు మాత్రమే సాధ్యమవుతుంది. అయితే తన  పోరాటాలను జనాలు బాగానే గమనిస్తున్నారన్న విషయమే పవన్ కు అర్ధంకావటంలేదు. తానేం చెప్పినా పొల్లుపోకుండా అచ్చేసే ఎల్లోమీడియా ఉందికాబట్టి పవన్ వేషాలు చెల్లుబాటైపోతున్నాయి. మాట స్ధిరత్వంకాని, విషయ పరిజ్ఞానం కానీ పవన్ కు బొత్తిగా లేదన్న విషయం అందరికీ ఎప్పుడో తెలిసిపోయింది.






అందుకనే పవన్ ఏమిచెప్పినా అదో జోక్ కింద తీసుకుంటున్నారు కానీ సీరియస్ గా ఎవరు తీసుకోవటంలేదు. జగన్ హయాంలో ఏదో జరిగిపోతోందని పవన్ చేస్తున్న గోలంతా చంద్రబాబు హయాంలో ఇంతకన్నా ఇంకాఎక్కువే జరిగింది. అప్పుడు కనీసం పవన్ నోరుకూడా విప్పలేదు. చంద్రబాబు హయాంలో జరిగిన కంపంతా ఏపీలో జరగనేలేదన్నట్లుగా పవన్ కళ్ళు మూసుకుని చోద్యం చూశారు. ఇపుడు మాత్రం గొంతుచించుకుని రెచ్చిపోతున్నారు. అందుకనే జగన్ దగ్గరనుండి మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలంతా పవన్ను చంద్రబాబుకు దత్తపుత్రుడని పదే పదే చెబుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: