జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా దెబ్బకొట్టాలి. అయితే అది ఎలాగో అర్ధంకావటంలేదు. ఎవరికి వారుగా ఉంటే ఇద్దరినీ కలిపి జగన్ రెండోసారి కూడా ఉతికిఆరేస్తడని భయం మొదలైంది. అందుకనే సమస్యల మీద పోరాటమంటు ఇద్దరు చేతులుకలిపారు. అంటే రేపటి ఎన్నికల్లో పొత్తుకు ముందుగానే బాటలు వేసుకున్నట్లుంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో ప్రత్యేకించి చెప్పాలా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్. ఇంతకీ వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఏమిజరిగింది ? ఏమి జరిగందంటే ఇద్దరు కలిసి జగన్ కు వ్యతిరేకంగా ఎంతవీలుంటే అంత గోలచేయాలని ప్లాన్ చేసుకున్నట్లున్నారు.
జగన్ కు వ్యతిరేకంగా రోడ్లపైన పవన్ గోలచేయాలని. తెరవెనుక నుండి అవసరమైన సహాయ సహకారాలు చంద్రబాబు అందించేట్లుగా. అందుకనే గడచిన పదిరోజులుగా పవన్ రోడ్లపైకి వచ్చి నానా గోలచేస్తున్న విషయం అర్ధమైపోతుంది. చంద్రబాబు ఎక్కువగా మీడియా సమావేశాలు, నేతల సమావేశాల్లో మాత్రమే జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. జగన్ పై తాను ఎంతగోలచేసినా జనాలునమ్మటంలేదని చంద్రబాబుకు అర్ధమైనట్లుంది.
అందుకనే రోడ్లపైకి పవన్ను పంపుతున్నారు. పవనే ఎందుకంటే పవర్ స్టార్ రోడ్లపైకి వస్తే అభిమానులనో లేకపోతే మామూలు జనాలనో చూడటానికి వస్తారుకదా. పవన్ చెప్పేది జనాలు నమ్మినానమ్మకపోయినా కనీసం పెద్ద క్రౌడ్ అయితే తయారవుతుంది. దీనికి ఎలాగూ ఎల్లోమీడియా ఫుల్లుగా సపోర్టుగా నిలుస్తుంది. కాబట్టి జగన్ పై జనాల్లో భీబత్సమైన వ్యతిరేకత పెరిగిపోతోందని హెడ్డింగులు పెట్టి బ్యానర్ కథనాలు అచ్చేసుకోవచ్చు.
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో, హోటల్లో, పవన్ హత్యకు హైదరాబాద్ ఇంటిముందు రెక్కీ, ఇపుడు ఇప్పటం గ్రామపర్యటనలో గొడవంతా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్లు అనుమానంగా ఉంది. లేకపోతే ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడిచేసింది జనసైనికులు. కానీ ఉల్టాగా ప్రచారం చేసుకున్నారు. పవన్ ఇంటిముందు మందుబాబుల గొడవే తప్ప రెక్కీకాదని పోలీసులే తేల్చేశారు. ఇప్పటం గ్రామంలో ప్రభుత్వస్ధలాన్ని ఆక్రమించి కట్టుకున్న ఇంటి కాంపౌడ్ వాల్సును కూల్చేస్తుంటే ఇళ్ళను కూల్చేస్తున్నారంటు గోల జరుగుతోంది. దీన్నిబట్టే అర్ధమవుతోంది తెరముందు పవన్ వెనుక చంద్రబాబు ఉన్నారని.