జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లటానికి మాత్రమే అని అందరికీ తెలిసిందే. గ్రౌండ్ రియాలిటీతో సంబంధంలేకుండానే తనదైన స్టైల్లో ప్రభుత్వంపై రెచ్చిపోతుంటారు. ఇదే విధమైన వ్యతిరేకత ఎల్లోమీడియాలో జగన్ పై ఉందికాబట్టి పవన్ ఏమి మాట్లాడినా, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చేస్తోంది. అయితే ఇలాంటి కార్యక్రమాలే పవన్ కు, పార్టీకి బూమరాంగ్ అవుతున్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే ‘జగనన్న ఇళ్ళు పేదలందరికీ కనీళ్ళు’ అనే కార్యక్రమాన్ని టేకప్ చేయాలని పవన్ పిలుపిచ్చారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే జగనన్న కాలనీల్లో లబ్దిదారులు ఇళ్ళు కట్టుకోవటంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని చాటిచెప్పటమే. కాలనీల్లో కనీస సౌకర్యాలు లేవని, ఇళ్ళ నిర్మాల పేరుతో పేదలను జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ప్రపంచానికి తెలియజేయటమే పవన్ ప్లాన్.
కార్యక్రమంలో భాగంగా కృష్ణ జిల్లాలోని పెడన నియోజకవర్గంలొ జనసేన నేతలు జగనన్న కాలనీకి వెళ్ళారు. ఈ కాలనీలో లబ్దిదారులతో మాట్లాడి తామంతా చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పాలని నేతలు అడిగారట. దానికి లబ్దిదారులు ఒప్పుకోలేదు. దాంతో నేతలు వాళ్ళపై ఒత్తిడి పెంచారని సమాచారం. నేతలు ఎప్పుడైతే ఒత్తిడి పెట్టారో వెంటనే లబ్దిదారులంతా తిరగబడ్డారు. కాలనీలు ఏర్పాటుచేసి సొంతంగా స్ధలాలిచ్చి, ఇళ్ళు కట్టిస్తున్న జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడమని తమను ఒత్తిడి చేయటం ఏమిటంటు అందరు ఒక్కసారిగా మండిపోయారు.
ఉన్నట్లుండి లబ్దిదారులకు, జనసేన నేతలకు మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. చివరకు అదికాస్త తోపులాటలదాకా వెళ్ళింది. దాంతో భవననిర్మాణ కూలీలంతా చేరటంతో చేసేదిలేక జనసేన నేతలు అక్కడినుండి వెళ్ళిపోయారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే లబ్దిదారుల్లో ఎవరైనా కష్టాలు పడుతుంటే వాళ్ళతో మాట్లాడచ్చు. పైగా లబ్దిదారులు కష్టాలు పడుతున్నారని నేతలకు చెబితే వాళ్ళు దాన్ని వీడియోలు తీసి పబ్లిసిటీ చేస్తారు. దాంతో లబ్దిదారులకు ఉన్నది కూడా ఊడిపోతుంది. అప్పుడు జనసేన నేతలు ఏమన్నా సాయంచేస్తారా ? ఇళ్ళ నిర్మాణం కాస్త అటుఇటుగా అవుతుందని అందరికీ తెలిసిందే. ఇంతోటిదానికి ఇంతపెద్ద సీన్ అవసరమా ?