జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలకు చేష్టలకు అసలు ఏమన్నా సింకౌతోందా ? వైసీపీది విధ్వంసమైతే జనసేనది వికాసమట. వైసీపీది ఆధిపత్యమైతే జనసేనది ఆత్మగౌరవమట. వైసీపీ అహంకారానికి అడ్డా అయితే ఇది జనసైనికుల గడ్డట. పవన్ మాటల గురించి ఆలోచిస్తే విచిత్రంగా ఉంటుంది. అసలు మాట్లాడే మాటలకు క్షేత్రస్ధాయిలో జరుగుతున్నదానికి సంబంధమే ఉండదు. అయినా నోటికొచ్చినట్లు ఏదేదో మాట్లాడేయటం, పూనకం వచ్చినవాళ్ళు ఊగిపోయినట్లు ఊగిపోవటమే పవన్ స్టైల్.





వైసీపీది విధ్వంసమని అంటున్న పవన్ విధ్వంసాలు ఎక్కడ జరిగాయో చెప్పటంలేదు. ఇప్పటంలో ఇళ్ళు కూల్చకపోయినా కూల్చేసినట్లు పవన్ చేసిన గోలను అందరు చూసిందే. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనో లేకపోతే అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేస్తున్నారనో ఫిర్యాదులొస్తే కూల్చేసుండచ్చు. లేదంటే లోకల్ గా గొడవల కారణంగా కూడా ఎక్కడైనా ఇళ్ళు కూల్చేసుండచ్చు. అంతేకానీ అదేపనిగా టార్గెట్ చేసి కూల్చేసిన నిర్మాణాలైతే లేవు. అసలు జనసేన వికసించనే లేదు ఇక వికాసం ఎక్కడుంది.





వైసీపీది ఆధిపత్యమైతే జనసేనది ఆత్మగౌరమట. రాజకీయాలంటేనే ఆధిపత్యమన్న విషయం పవన్ కు తెలీకపోవటమే అజ్ఞానాన్ని సూచిస్తోంది. తాను సీఎం అయిపోవాలని అనుకోవటం కూడా ఆధిపత్యంలో భాగమే కదా. ఇక ఆత్మగౌరవం గురించి పవన్ ఎంత తక్కువగా మాట్లాడితే అంతమంచిది. తనపైన ప్యాకేజీస్టార్ అని, దత్తపుత్రుడని ఎందుకు ముద్రపడిందో పవన్ ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది.





వైసీపీది  ఆహంకారమైతే ఇది జనసైనికుల గడ్డట. 151 సీట్లు గెలుచుకున్న వైసీపీకి కచ్చితంగా అహంకారం ఉండటంలో తప్పేలేదు. కాకపోతే అది మితిమీరితే మాత్రం మోసం వస్తుంది. పోటీచేసిన ఒక్కసీటులో మాత్రమే గెలిచిన జనసేనకి అడ్డా ఎక్కడుంది. పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడిపోయిన పవనే ఇది తన అడ్డా అని గర్వంగా చెప్పుకుంటున్నపుడు 151 సీట్లు గెలిచిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంకేమనుకోవాలి ? మొత్తానికి తాను అజ్ఞానవాసనని  పవన్ తనకు తానే టముకేసుకుంటున్నారు. ఇలాంటి డైలాగులు సినిమాల్లో చెల్లుతాయేమో కానీ రాజకీయాల్లో చెల్లవని ఎప్పటికి తెలుసుకుంటాడో ఏమో ?


 

మరింత సమాచారం తెలుసుకోండి: